Lifestyle: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే
High Cholesterol Symptoms: ప్రతీ ఒక్కరిలో కొలెస్ట్రాల్ కచ్చితంగా ఉంటుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనే రెండు రకాలు ఉంటాయి.
Lifestyle: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే
High Cholesterol Symptoms: ప్రతీ ఒక్కరిలో కొలెస్ట్రాల్ కచ్చితంగా ఉంటుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనే రెండు రకాలు ఉంటాయి. అయితే చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఎన్నో రకాల సమస్యలకు కారణమవుతాయని తెలిసిందే. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు మొదలు ఇతర సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది.
అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందన్న విషయాన్ని ముందుగా గుర్తిస్తే చికిత్స తీసుకోవచ్చు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందన్న విషయాన్ని శరీరం మనల్ని ముందుగానే అలర్ట్ చేస్తుంది. కొన్ని లక్షణాల ఆధారంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందో లేదో తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
* చర్మంపై పసుపు రంగులో కొవ్వు గడ్డలు ఏర్పడటం చెడు కొలెస్ట్రాల్ పెరిగిందని చెప్పేందుకు మొదటి సంకేతంగా భావించాలి. ఇవి ముఖ్యంగా మోకాళ్లు, మోచేతులు, పాదాలలో కనిపిస్తాయి.
* అధిక కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాలు ఇరుకుగా మారుతాయి. రక్తప్రసరణ తగ్గిపోవడంతో కాళ్లలో నొప్పి, తిమ్మిరి అనిపించవచ్చు. దీర్ఘకాలంగా ఈ సమస్య ఉంటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి.
* రక్తప్రసరణ సరిగ్గా లేకపోతే పాదాలు చల్లగా మారుతాయి. ఎలాంటి కారణం లేకుండా పాదాలు చల్లగా మారితే. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందని అర్థం చేసుకోవాలి. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* రక్తనాళాలు ఇరుకుగా మారితే కాళ్ల చర్మం మెరిసేలా కనిపించవచ్చు. ఇది ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి ఈ లక్షణం కనిపిస్తున్నా వెంటనే అలర్ట్ అవ్వాలి.
* అధిక కొలెస్ట్రాల్ వల్ల కొన్ని సందర్భాల్లో కాళ్లలో ఉబ్బిన, మెలితిరిగిన సిరలు కనిపించవచ్చు. దీనిని వెరికోస్ వెయిన్స్‌గా పిలుస్తారు.
పైన తెలిపిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వెంటనే వైద్యులను సంప్రదించి, కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా దీనిని కంట్రోల్ చేయొచ్చు.