Tomato: టమాటాతో ఇలా ఫేస్ స్క్రబ్‌ తయారు చేసుకుంటే మచ్చలేని మెరిసే అందం మీ సొంతం..

Tomato Face Scrub: టమాటాలు వివిధ కూరల్లో వేసుకుని తింటాం. ఇందులో లైకోపీని ఉంటుంది. అయితే ప్రతిరోజు టమాటా తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మరీ టమోటాతో స్క్రబ్‌ చేసుకోవటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా.

Update: 2025-03-25 09:07 GMT
Tomato: టమాటాతో ఇలా ఫేస్ స్క్రబ్‌ తయారు చేసుకుంటే మచ్చలేని మెరిసే అందం మీ సొంతం..
  • whatsapp icon

Tomato Face Scrub: ప్రతిరోజు మనం ఏదో ఒక రూపంలో టమాటాలు డైట్లో చేర్చుకుంటాం. ఇందులో లైకోపీన్ ఉంటుంది. ఇది మన చర్మానికి మంచి పోషణ అందిస్తుంది. ఆరోగ్యానికి కూడా మేలు.. అయితే టమాటాతో స్క్రబ్ తయారు చేసుకోవడం వల్ల మెరిసే మచ్చలేని అందం మీ సొంతం అవుతుంది. ఇది సహజసిద్ధంగా ముఖానికి కాంతివంతం చేస్తుంది. టమాటాలతో ఐదు విధాలుగా ఎలాంటి స్క్రబ్లు తయారు చేసుకోవచ్చు తెలుసుకుందాం..

టమాటో చక్కెరతో కలిపి స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. దీనికి ముందుగా టమాటా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. చక్కెరను కాస్త పొడి చేసుకోవాలి. దీంతో స్క్రబ్‌ తయారు చేసుకోని ముఖంపై సర్క్యూలర్‌ మోషన్‌లో మృదువుగా రుద్దాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి.

అరటిపండుతో కూడా స్క్రబ్ చేసుకోవచ్చు. టమాటా, అరటిపండు రెండిటినీ గుజ్జులా మిక్స్ చేసి ముఖాన్ని బాగా స్క్రబ్ చేసుకోవాలి. దీనితో మృదువుగా మీ చర్మం మారిపోతుంది. అరటిపండులో ఉన్న పొటాషియం, విటమిన్స్ చర్మానికి బాగా అందుతాయి.

టమాటా, తేనె కలిపి ముఖాన్ని స్క్రబ్ చేసుకోవచ్చు. ఇందులో కాస్త కోకో పౌడర్ కూడా కలపాలి. దీంతో మన చర్మంపై ఉంటే డెడ్‌ స్కిన్ సేల్స్ కూడా తొలగిపోయి ముఖానికి పునరుజ్జీవనం అందిస్తుంది. తేనే ముఖానికి నేచురల్‌గా గ్లాసీ స్కిన్‌ అందిస్తుంది.

టమాటా, బేకింగ్ సోడా కలిపి కూడా స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. ఈ రెండిటిని బాగా మిక్స్ చేసి ముఖంపై మృదువుగా సర్క్యూలర్‌ మోషన్‌లో రుద్దాలి. ఓ ఐదు నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

టమాటా, పెరుగు కలిపి కూడా ఫేస్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఈ రెండిటిలో కాస్త చక్కర వేసుకొని స్క్రబ్‌ కూడా తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని వాష్ చేసుకోవాలి. ఈ స్క్రబ్స్‌ అన్నింటిలో ఏదైనా ఒకటి వారంలో కనీసం రెండుసార్లు ఉపయోగించడం వల్ల మచ్చలేని కాంతివంతమైన చర్మం పొందుతారు. ఇక టమాటా పసుపుతో కూడా ముఖాన్ని రుద్దటం వల్ల ఎండ వల్ల వచ్చే ట్యాన్‌ త్వరగా తొలగిపోతుంది. ఇవి సహజ సిద్ధమైన కాంతిని ముఖానికి అందిస్తాయి. ముఖంపై ఉండే మచ్చలు, గీతాలు తొలగిపోయేలా సహాయపడతాయి.

Tags:    

Similar News