Health News: రోజుకు రెండు కంటే ఎక్కువసార్లు బాత్‌రూమ్‌కు వెళ్తున్నారా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!
Poop Schedule: రోజుకు ఒక్కసారి లేదా రెండుసార్లు మలవిసర్జన చేయడం శరీరానికి మంచిది. దీని ద్వారా గట్ హెల్త్ మెరుగవుతుంది.. టాక్సిన్లు తగ్గుతాయి..!

Health News: రోజుకు రెండు కంటే ఎక్కువసార్లు బాత్‌రూమ్‌కు వెళ్తున్నారా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!
Poop Schedule: ఒక మనిషి ఆరోగ్యం గురించి చెప్పేందుకు డాక్టర్లు రక్తపరీక్షలు, బీపీ లాంటి ఎన్నో పరీక్షలు చేస్తుంటారు. కానీ తాజా అధ్యయనం చెబుతున్న విషయం ఏంటంటే... మన రోజువారీ 'పూప్' టైమింగ్స్ కూడా ఆరోగ్యానికి అద్దంపట్టినట్టుగా ఉంటాయట. అంటే, మనం బాత్రూమ్‌కు ఎంత వరకూ వెళ్తున్నామన్నదే మన శరీరంలో జరుగుతున్న మార్పులను సూచించే కీలక సంకేతం అవుతుంది. ఒక్కసారి లేదా రెండు సార్లు రోజుకు బదులు వారంలో ఒక్కసారి మాత్రమే పూప్ చేసేవారిలో, రక్తంలో కొన్ని విషకారక టాక్సిన్లు పెరుగుతున్నట్లు పరిశోధనలో తేలింది. గ్యాస్, బలహీనత, తలనొప్పులు ఇవన్నీ శరీరంలో గుట్టుగా పేరుకుపోయే టాక్సిన్ల వల్లే అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇవి కిడ్నీలకు పెద్ద భారం అవుతాయని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, మలాన్ని శరీరంలో ఎక్కువసేపు ఉంచితే, ఫైబర్ ఫెర్మెంటేషన్ ఆగి ప్రోటీన్లు ఫెర్మెంట్ అవుతాయి. దీంతో టాక్సిన్లు ఉత్పత్తి అవుతాయి.
ఇక రోజుకు మూడుసార్లు వరకు బాత్రూమ్‌కి వెళ్లేవారిలో మళ్లీ మరో సమస్య. వాళ్ల శరీరం ఎక్కువగా బైల్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కొవ్వులను జీర్ణించేందుకు అవసరమైన పదార్థం. ఇది ఎక్కువగా బయటకు వెళ్లిపోతే, కాలేయంపై భారం పడుతుంది. దీర్ఘకాలంగా ఇది ఇన్‌ఫ్లమేషన్‌కు, లివర్ సమస్యలకు దారి తీస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో సరైన సమతుల్యతలో ఉండే వారు.. అంటే రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మలవిసర్జన చేసే వారు ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనం స్పష్టం చేస్తోంది. వీళ్లకు గట్‌లో ఫైబర్‌ను ఫెర్మెంట్ చేసే మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ 'గోల్డిలోక్స్ జోన్' అని పిలిచే స్థితిలో ఉన్నవారిని పరిశీలిస్తే, వీళ్ల ఆహారపద్ధతిలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండటం, నీరు తగినంత తాగడం, శారీరక చలనం ఉండడం లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు కనిపించాయి. ఈ అంశంపై ఇంకా లోతుగా అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీన్ని ఒక రకమైన 'హెల్త్ సిగ్నల్' లాగా భావించి, మన శరీరానికి అవసరమైన పోషకాహారం, జీవనశైలి పాటించడం అవసరం.