Almonds: చెడు కొలెస్ట్రాల్ ఐస్‌లా కరిగిపోవాలంటే రోజు ఇన్ని బాదం పప్పులు తినండి..!
Almonds Sheds Bad Cholesterol: మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతే ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది.

Almonds: చెడు కొలెస్ట్రాల్ ఐస్‌లా కరిగిపోవాలంటే రోజు ఇన్ని బాదం పప్పులు తినండి..!
Almonds Sheds Bad Cholesterol: ప్రతిరోజు నానబెట్టిన బాదం పప్పులు తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాదు ఇందులో పోషకాలు పుష్కలం. ప్రోటీన్లు. విటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియం అందుతుంది. అయితే చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి రోజు ఎన్ని బాదం పప్పులు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు.
బాదంపప్పు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. అంతేకాదు బరువు పెరగకుండా నివారిస్తుంది. కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారికి ఇది మంచిది. బాదంపప్పు తీసుకోవటం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతాయి. ఉదయం నానబెట్టి తీసుకోవచ్చు లేదా సాయంత్రం స్నాక్స్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.
రెగ్యులర్ గా బాదంపప్పు తీసుకోవడం వల్ల ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. అంతేకాదు ఇది అర్టెరీ బ్లాక్ కాకుండా కాపాడుతుంది. దీంతో మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇందులో ఉంటాయి.
బాదంపప్పులు తినేవారిలో హార్ట్ ఎటాక్ ప్రమాదాలు తక్కువగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం నానబెట్టిన గుప్పెడు బాదం పప్పులు డైట్ లో చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. ఉదయం తీసుకోలేని వారు సాయంత్రం స్నాక్ రూపంలో తీసుకోవచ్చు.
మన గుండె ఆరోగ్యానికి ప్రతిరోజు గుప్పెడు గింజలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. ఇందులో వాల్నట్స్ కూడా ఒకటి. బాదంపప్పు కలిపి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఆరోగ్యకరమై కొవ్వులతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీర ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. రెగ్యులర్ డైట్ లో మనం ఈ గింజలు చేర్చుకోవడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా మన దరిచెరవు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగవు చక్కర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.