Glowing Skin: మెరిసే ముఖానికి ఫిత్కారీ.. ఇక ఖరీదైన ఫేస్ క్రీములకు బై బై..!
Glowing Skin in Summer: ఈ కాలంలో 30 వయసు రాగానే ఫేస్ డల్ గా మారిపోతుంది నిర్జీవంగా కనిపిస్తుంది అయితే కొన్ని ఇంటి చిట్కాలతో పూర్వ వైభవాన్ని తీసుకురావచ్చు.

Glowing Skin: మెరిసే ముఖానికి ఫిత్కారీ.. ఇక ఖరీదైన ఫేస్ క్రీములకు బై బై..!
Glowing Skin in Summer: 25- 30 వయసు రాగానే చర్మ సంబంధిత సమస్యలు ప్రారంభమవుతాయి. వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపిస్తాయి. అయితే దీనికి ప్రధాన కారణం వాతావరణం, స్ట్రెస్ , సరైన స్కిన్ కేర్ రొటీన్ పాటించకపోవడం. కొన్ని ఇంటి చిట్కాలు వాడితే త్వరగా ఈ సమస్య నుంచి బయటపడతారు. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఉదయం కొన్ని స్కిన్ కేర్ రొటీన్స్ ప్రారంభించాలి.
ఫిత్కారీ, బియ్యం పిండి కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మ సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. అంతేకాదు కలబంద, కాఫీ, రోజ్ వాటర్ కలిపి కూడా వారానికి రెండుసార్లు ముఖానికి అప్లై చేయడం వల్ల స్కిన్ టైట్ గా మారుతుంది.
ముల్తానీ మిట్టి కూడా ఉపయోగించండి. ఇది ముఖంపై మచ్చలు, గీతాలు తొలగిస్తుంది. మూల్తానీ మిట్టి, రోజ్ వాటర్ లేదా పచ్చిపాలన ఉపయోగించి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఇది వారానికి మూడుసార్లు ప్రయత్నించండి.
ఇది కాకుండా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొన్ని స్కిన్ కేర్ టిప్స్ పాటించాలి. ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మలినాలు తొలగిపోతాయి. రాత్రి పడుకునే ముందు ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేసి పడుకోండి.
నెలలో కనీసం రెండు మూడు సార్లు ఫేషియల్ చేయించుకోవడం అలవాటు చేసుకోవాలి. తద్వారా ముఖంపై ఉండే డెడ్ సెల్ స్కిన్ తొలగిపోయి, ముఖం టైట్ గా మారుతుంది. రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది.
శనగపిండి, బియ్యం పిండి కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఇందులో రోజ్ వాటర్ వేసుకొని అప్లై చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. రోజు రాత్రి ఈ చిట్కా ప్రయత్నించండి.