Diabetes: ఈ 5 గింజలు షుగర్‌ రోగులకు వరం.. కొలెస్ట్రాల్‌ కూడా కరిగిపోతుంది..

Diabetes Control Nuts: మన జీవితంలో ఒకసారి డయాబెటిస్ వస్తే అది చచ్చే వరకు వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవాలి. అయితే ఐదు రకాల గింజలు డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తాయి.

Update: 2025-03-19 16:30 GMT
Diabetes

Diabetes: ఈ 5 గింజలు షుగర్‌ రోగులకు వరం.. కొలెస్ట్రాల్‌ కూడా కరిగిపోతుంది..

  • whatsapp icon

Diabetes Control Nuts: ఈ 5 గింజలు షుగర్ వ్యాధిగ్రస్తులకు వరం.. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌కు సైతం చెక్ పెడుతుంది. అంతేకాదు ఈ గింజలు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. డైట్‌లో చేర్చుకోవడం వల్ల గరిష్ట ప్రయోజనాలు పొందుతారు.

వాల్‌నట్స్..

వాల్‌నట్స్ ప్రతిరోజు రాత్రి నానబెట్టిన ఈ గింజలను ఉదయం తీసుకోవడం వల్ల ప్రయోజనాలు బోలెడు. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మంట సమస్యలను తగ్గిస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల షుగర్ గ్రహిస్తుంది. హఠాత్తుగా షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది.. అంతేకాదు మంచి రక్తప్రసరణ కూడా ప్రేరేపిస్తాయి.

బాదం..

డయాబెటిస్ రోగులు బాదంపప్పులు డైట్లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు ఇందులో మోనో అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు, ఫైబర్, మెగ్నీషియం ఉంటాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతను మెరుగు చేస్తుంది. అంతేకాదు గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. డయాబెటిస్ రోగులు ప్రతిరోజు గుప్పెడు బాదం తింటే రక్తంలో షుగర్ స్థాయిలో అదుపులో ఉంటాయి. కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలుగుతుంది.

పిస్తా ..

పిస్తా పప్పు డయాబెటిస్ రోగులకు ఎంతో ప్రయోజనకరం. ఇందులో ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అంతేకాదు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించేస్తుందని కొన్ని నివేదికగా తెలిపాయి. బ్లడ్‌ ప్రెజర్‌ స్థాయిలను అదుపులో ఉంచే గుణం పిస్తాల్లో ఉన్నాయి.

జీడిపప్పు..

జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఫైబర్ ఉంటాయి. అంతేకాదు ఇందులో గ్లైసమిక్ సూచీ (GI) కూడా తక్కువగా ఉంటుంది. అందుకే రక్తంలో షుగర్ స్థాయిలను హఠాత్తుగా పెరగనివ్వవు. ఇందులోని మెగ్నీషియం షుగర్ లెవెల్స్ నియంత్రిస్తుంది.

బ్రెజిల్ నట్స్ ..

ఇవి కాకుండా బ్రెజిల్ నట్స్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. ఎందుకంటే ఇందులో సెలీనియం ఉంటుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. డయాబెటిస్ రోగులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధిక మోతాదులో ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు గుండెకు ఇది ఎంతో మంచిది.

Tags:    

Similar News