White Hair: ఈ చిన్ని చిట్కాతో మీ తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారిపోతుంది..
White Hair Remedy: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా ఈ చిట్కాలు ప్రయత్నిస్తే సహజ సిద్ధంగా నల్లగా మారిపోతాయి. కెమికల్ ఉన్న ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అవేంటో తెలుసుకుందాం..

White Hair: ఈ చిన్ని చిట్కాతో మీ తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారిపోతుంది..
White Hair Remedy: సాధారణంగా వయస్సు రీత్యా తెల్లజుట్టు వస్తుంది. కానీ మధ్య కాలంలో చిన్నపిల్లలకు కూడా తెల్ల జుట్టు సమస్య వేధిస్తోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా డైట్ సరిగా లేకపోవడం, అతిగా స్ట్రెస్, పొల్యూషన్ కెమికల్ హెయిర్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల కూడా తెల్ల జుట్టు సమస్య వేధిస్తుంది. దీనికి చిన్ని చిట్కా పాటిస్తే సహజసిద్ధంగా నల్ల రంగులోకి మారిపోతాయి.
కొబ్బరి నూనె, హెన్నా..
తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారిపోవడానికి ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ హెన్నా తీసుకోండి. అందులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె బాగా మిక్స్ చేసి పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. దీన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేయాలి. ఓ రెండు గంటల తర్వాత ఆరిపోతుంది. ఆ తర్వాత సాధారణ షాంపుతో తల స్నానం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి ప్రయత్నించండి.
కొబ్బరి నూనె, నల్ల నువ్వులు..
ఈ రెండిటితో కూడా తెల్ల జుట్టుకు చెక్ పెట్టవచ్చు. మొదటగా ఒక కప్పు కొబ్బరి నూనె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులు వేసి చిన్న మంట పైన మురిగించాలి. ఆ తర్వాత దీన్ని వడ గట్టుకుని ఓ బాటిల్ స్టోర్ చేసుకోవాలి. ఇది జుట్టు అంతటికీ పట్టించి నైట్ అలాగే ఉంచండి. ఉదయం తల స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
కొబ్బరినూనె, ఉసిరి పొడి..
ఇందులో మీరు ఉసిరి పొడి కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ముందుగా నాలుగు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి, ఒక స్పూను కొబ్బరి నూనె వేసి బాగా మురిగించాలి. చిన్న మంటపై మరిగించిన తర్వాత దీన్ని బాగా జుట్టు అంతటికీ పట్టించాలి ఆ తర్వాత తల స్నానం చేసుకుంటే నల్లగా మారిపోతాయి.
అయితే ఇలాంటి హెయిర్ ప్యాక్ లు మాత్రమే కాదు మీ డైట్ లో కూడా కొన్ని రకాల ఫుడ్స్ తప్పనిసరిగా ఉండాలి. ప్రధానంగా పాలకూర, బాదం, గుడ్లు వంటివి చేర్చుకోవాలి. ఇందులో ఐరన్ బయోటిన్ ఉంటాయి. అంతేకాదు స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. దీనికి యోగా, మెడిటేషన్ వంటివి చేస్తూ ఉండాలి. ఇంకా కెమికల్ అధికంగా ఉండే ఉత్పత్తులను వాడకుండా ఉండాలి. తరచుగా కొబ్బరి నూనె జుట్టుకు మసాజ్ చేయాలి. ఇలాంటి చిట్కాలు పాటించడం వల్ల తెల్లజుట్టు సమస్యకు పరిష్కారం అందుతుంది.