Weight Loss Breakfast: బరువు తగ్గాలంటే ఉదయం ఈ ప్రోటీన్ ఉండే 5 బ్రేక్ ఫాస్టులు తినాల్సిందే..

Weight Loss Breakfast: బరువు తగ్గాలని చాలామంది అనుకుంటారు. అయితే బిజీ లైఫ్ వల్ల ఒబేసిటీ అతిగా వేధిస్తుంది. ఇది కాకుండా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా బరువు పెరిగేలా చేస్తాయి.

Update: 2025-03-24 15:30 GMT
Weight Loss Breakfast

Weight Loss Breakfast: బరువు తగ్గాలంటే ఉదయం ఈ ప్రోటీన్ ఉండే 5 బ్రేక్ ఫాస్టులు తినాల్సిందే..

  • whatsapp icon

Weight Loss Breakfast: ప్రస్తుతం ఎక్కువ కూర్చొని వర్క్ చేయడం వల్ల బరువు సులభంగా పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇది ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కారణమవుతుంది. అతి బరువు వల్ల ఏ పని చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. అంతేకాదు చూడ్డానికి కాస్త ఆకారం కూడా అంద విహీనంగా కనిపిస్తుంది. అందుకే బరువు తగ్గాలని చాలామంది అనుకుంటారు. దానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.. అయితే బరువు తగ్గాలంటే మీ మొదటి బ్రేక్ ఫాస్ట్ లో ఇలా ప్రోటీన్ ఉండే ఆహారాలు తీసుకోండి..

ప్రోటీన్‌ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల రోజంతటికి కావలసిన శక్తి అందిస్తాయి. ఇది కాకుండా మీరు బరువు కూడా సులభంగా తగ్గిపోతారు.

మూంగ్‌దాల్‌ చిల్లా..

పెసర్లతో తయారు చేసిన ఈ మూంగ్‌ దాల్‌ చిల్లా తీసుకోవడం వల్ల ఫైబర్, ప్రోటీన్ అందుతుంది. బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ మూంగ్ దాల్‌తో తయారుచేసిన చిల్లాలను తినడం, రిసిపీని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం చూశాం. పెసరపప్పుని నానబెట్టి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. అందులో మిరియాలు, ఉప్పు ఇతర కూరగాయలు వేసి తయారు చేస్తారు. ఇది మెటాలిజం రేటును పెంచుతుంది. బరువును సులభంగా తగ్గించేస్తుంది..

మొలకెత్తిన సలాడ్..

మొలకెత్తిన విత్తనాలు ఎప్పటికైనా ఆరోగ్యకరమే. అయితే మొలకెత్తిన సలాడ్ తీసుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గిపోతారు. ఉదయం పెసర్లు, శనగలు ఇతర పప్పులతో తయారు చేసిన ఈ స్ప్రౌటెడ్ సలాడ్ తీసుకుంటే మన శరీరానికి ప్రోటీన్ అందుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. బరువు కూడా సులభంగా తగ్గుతారు

బేసన్ చిల్లా..

శనగపిండితో తయారు చేసే ఈ చిల్లా కూడా చూడటానికి ప్యాన్‌కేక్‌లా ఉంటుంది. ఇందులో ప్రోటీన్ అధిక మోతాదులో ఉండటం వల్ల ఆరోగ్యకరం. అంతే కాదు బేసన్‌ చిల్లాలో కూడా ఉప్పు, మిరియాల పొడి, ఇతర కూరగాయలు వేసి తయారు చేసుకోవడం వల్ల మంచి ప్రోటీన్ పుష్కలంగా ఉండే బ్రేక్ఫాస్ట్ తయారవుతుంది. బరువు ఈజీగా తగ్గిపోతారు.

ఉప్మా..

ఇది కాకుండా క్వినోవాతో ఉప్మా తయారు చేసుకున్న కూడా ఇందులో ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది రుచికరంగా ఉంటుంది. మనకు కావాల్సిన కూరగాయలు కూడా వేసుకొని తీసుకోవాలి. ఇది ఆరోగ్యకరమైన ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్ అవుతుంది.

రాగి దోశ..

రాగులు మన అమ్మమ్మల కాలం నాటి నుంచి తీసుకునే ఒక ఆరోగ్యకరమైన ధాన్యం. వీటితో అంబలి తయారు చేసుకుంటాం. అయితే రాగితో ఈ మధ్య కాలంలో దోశ, ఇడ్లీ వంటివి తయారు చేసుకుంటున్నారు. రాగితో చపాతీలు కూడా ప్రత్యేకమే. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో రాగిదోశ వేసుకొని తీసుకోవడం వల్ల మనకు ప్రోటీన్ అందుతుంది. కావలసిన శక్తి అందుతుంది. దీన్ని సాంబార్ లేదా చట్నీలో కలిపి తీసుకుంటే మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్ అవుతుంది.

Tags:    

Similar News