Radiant Skin: వేసవిలో మెరిసే ముఖానికి తులసి.. ఈ 5 విధాలుగా వాడి చూడండి..
Radiant Skin With Tulasi: తులసిలో చర్మానికి మేలు చేసే పవర్‌హౌస్. తులసి చెట్టు ఇంట్లో పెట్టుకుని పూజిస్తారు. కానీ, ఇందులో ఔషధ గుణాలు కూడా మెండుగా ఉంటాయి.

Radiant Skin With Tulasi: మండే ఎండలో తులసితో తయారు చేసిన ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. తులసి తీసుకోవడం వల్ల జులుబు, దగ్గు, ఫ్లూ వంటి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. అయితే, ఈ పవిత్రమైన మొక్క ఆకులతో ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా మేలు జరుగుతుంది. ఈ ఆకులతో ముఖం మచ్చ లేకుండా మెరిసిపోతుంది.
తులసిలో యాంటీ బ్యాక్టిరియల్ యాంటీ ఇన్‌ఫ్లమేటీ గుణాలు ఉంటాయి. దీంతో మన ముఖంపై ఉండే యాక్నే, మచ్చలు, గీతలు కూడా తొలగిపోతాయి.అంతేకాదు ముఖంపై ఉండే అదనపు నూనెను గ్రహించేస్తుంది. ఇది ముఖాన్ని క్లెన్స్ చేసి ఓపెన్ పోర్స్ తగ్గించేస్తుంది. దీనికి మీరు ఒక గుప్పెడు తులసి ఆకుల్లో ఒక చెంచా తేనె వేసి బాగా గ్రైండ్ చేయాలి. దీన్ని ముఖం అంతా అప్లై చేసి ఓ అరగంటపాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.
తులసి నిర్జీవమైన స్కిన్‌కు జీవాన్ని అందిస్తుంది. ఎందుకంటే ఇందులో యూర్సోలిక్ యాసిడ్ ఉంటుంది. ముఖానికి ఈవెన్ స్కిన్ టోన్ అందిస్తుంది. దీంతో మీ ముఖం మచ్చ లేకుండా కనిపిస్తుంది. తులసి ఆకుల్లో నిమ్మరసం వేసుకుని, శనగపిండి కలిపాలి. దానికి తగినంత నీరు కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని ముఖం, మెడ భాగంలో అప్లై చేయాలి.
ముఖంపై వచ్చే దురదలను, ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. ఎండ వల్ల కమిలిపోయిన ముఖానికి ఉపశమనం అందిస్తుంది. తులసి ఆకులను గ్రైండ్ చేసి నేరుగా ముఖంపై అప్లై చేయాలి. ఆరిన తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి.
ఇలా ముఖానికి తులసి అప్లై చేయడం వల్ల నల్లమచ్చలు తగ్గిపోతాయి. మచ్చలను సులభంగా తగ్గించేస్తుంది. ముఖంపై ఉండే రంధ్రాలు తగ్గిపోతాయి. ఓ పది నిమిషాలు తులసి ఆకులను ఉడికించి చల్లారనివ్వాలి. ఆ తర్వాత మీ ముఖానికి ఆ నీటిని స్టీమ్ చేయాలి. ఓ పది నిమిషాలు ఇలా చేసిన తర్వాత కాటన్‌తో తుడుచుకోవాలి.