Weight Loss: బరువు తగ్గాలంటే రేపటి నుంచి ఉదయమే ఈ డ్రింక్ తాగండి..
Weight Loss Morning Drinks: బరువు తగ్గాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఎక్సర్‌సైజులు, ఆహారంలో మార్పులు చేసుకుంటారు. అయితే ఈ ఐదు రకాల డ్రింక్స్ తాగితే బరువు తగ్గుతారు.

Weight Loss: బరువు తగ్గాలంటే రేపటి నుంచి ఉదయమే ఈ డ్రింక్ తాగండి..
Weight Loss Morning Drinks: మనం ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు మన బరువుపై ప్రభావం పడుతుంది. అందుకే ఉదయం పరగడుపున తీసుకునే ఆహారం కూడా ఆరోగ్యకరమైనది అయి ఉండాలి. ఉదయం పరగడపున ఈ డ్రింక్స్ తాగితే బరువు ఈజీగా తగ్గిపోతారు. బెల్లీ ఫ్యాట్ సులభంగా కరిగిపోతుంది.
నిమ్మకాయ నీరు..
ఉదయం పరగడుపున నిమ్మకాయ నీటిని తీసుకోవడం వల్ల కొవ్వు కరిగిపోతుంది. ఇది మెటబాలిజం పెంచేడానికి సహాయపడుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సీ కొవ్వు కణాలను విడగొడుతుంది.అంతేకాదు మన శరీరంలో నుంచి విష పదార్థాలను బయటకు పంపించేస్తుంది.
గ్రీన్ టీ..
ఉదయం టీ, కాఫీలకు బదులుగా గ్రీన్ టీ అలవాటు చేసుకోండి. ఇది కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కూడా మెటబాలిజం రేటును పెంచుతుంది. అంతేకాదు మంట, వాపు సమస్యను తగ్గిస్తుంది.గ్రీన్ టీ లో కెఫైన్ ఉంటుంది. ఇది ఉదయం తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందిస్తుంది.
దాల్చిన చెక్క నీరు..
దాల్చిన చెక్క నీరు రుచికరంగా ఉండటమే కాదు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అంతేకాదు దాల్చిన నీరు మెటబాలిజం రేటును బూస్ట్ చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
అల్లం టీ..
ఉదయం అల్లం టీ గోరువెచ్చగా తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. ఇది మెటబాలిజం రేటు పెరుగుతుంది. అంతేకాదు నీరసానికి కూడా చెక్ పెడుతుంది. అల్లం టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. అల్లంలో ఉండే జింజోరెల్ కడుపు సమస్యలను కూడా తగ్గించేస్తుంది. ఈ టీ షుగర్‌వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. ఉదయం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరగకుండా ఉంటాయి. ఇది ఫ్యాట్ బర్న్ చేసే గుణం కలిగి ఉంటుంది.
సోంపు నీరు..
ఉదయం పరగడపున సోంపు నీరు తాగడం వల్ల కొవ్వు కరిగిపోతుంది. అంతేకాదు సోంపు నీటిలో డైరుటిక్ గుణాలు శరీరంలోని విషపదార్థాలను బయటకు ఫ్లష్ చేస్తుంది. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. దీంతో కడుపు నిండిన అనుభూతి కూడా కలుగుతుంది. దీంతో అతిగా తనికుండా ఉంటారు. బరువు పెరగకుండా ఉంటారు. సోంపు రాత్రి నానబెట్టి ఉదయం ఆ నీటిని తీసుకోవచ్చు. లేదా ఉదయం సోంపు, నీరు కలిపి మరిగించి కూడా ఆ నీటిని వడకట్టి తీసుకోవాలి.