Back Pain: వెన్ను నొప్పి రావడానికి అసలు కారణం ఏంటో తెలుసా.?
Back Pain Causes and Precautions: మనలో ప్రతీ ఒక్కరు, ఏదో ఒక సమయంలో వెన్ను నొప్పితో బాధపడే ఉంటాం.

Back Pain Causes and Precautions: మనలో ప్రతీ ఒక్కరు, ఏదో ఒక సమయంలో వెన్ను నొప్పితో బాధపడే ఉంటాం. కొంతమందికి ఇది తక్కువ రోజులు ఉంటే తగ్గిపోతుంది. కానీ కొందరిలో మాత్రం దీర్ఘ కాలంగా వెంటాడుతుంది. అయితే ఇలా ఎక్కువ రోజులు వెన్న నొప్పి వేధిస్తుంటే మాత్రం వైద్యులను సంప్రదించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వెన్ను నొప్పి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వెన్నునొప్పి రావడానికి ప్రధాన కారణాలు:
కండరాల ఒత్తిడి:
బరువు వత్తులు లేపడం వల్ల వెన్నెముక చుట్టూ ఉన్న కండరాలకు ఒత్తిడి వస్తుంది. ఇలా తరచూ బరువులు ఎత్తే వారిలో వెన్ను నొప్పి సమస్య వేధిస్తుంది.
డిస్క్ సమస్యలు:
మన వెన్నెముక ఎముకల సముదాయం. వాటి మధ్య "డిస్క్" అనే రబ్బరు లాంటి పదార్థం ఉంటుంది. అవి చీలిపోతే లేదా కదలితే, నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనినే "సయాటికా" అంటారు. ఇది తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.
స్కోలియోసిస్:
వెన్నెముక ఒక వైపుకి వంగిపోతే ఈ పరిస్థితి వస్తుంది. ఇది ఎక్కువగా మధ్య వయసులో వస్తుంది. దీనివల్ల తీవ్రమైన వెన్ను నొప్పి వస్తుంది.
ఆర్థరైటిస్:
వయసుతో పాటు వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల వెన్నులో నొప్పి రావచ్చు. ఇది "స్టెనోసిస్" అనే పరిస్థితికి దారి తీస్తుంది, అంటే వెన్నుపాము చుట్టూ ఖాళీ స్థలం తగ్గిపోతుంది.
ఆస్టియోపోరోసిస్:
ఈ పరిస్థితిలో ఎముకలు బలహీనంగా మారి, సులభంగా పగిలిపోతాయి. వెన్నెముకలో చిన్న పగుళ్లతో తీవ్రమైన నొప్పి వస్తుంది.
ఎలా జాగ్రత్త పడాలి?
సహజంగా వెన్నునొప్పి తక్కువ సమయంలో తగ్గిపోతుంది. కానీ ఎక్కువ రోజులు కొనసాగితే వైద్యుని సంప్రదించాలి. కొందరికి అక్యుపంక్చర్ లేదా షియాట్సు థెరపీ అవసరపడుతుండొచ్చు. బరువులు మోసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కూర్చునే విధానం సరిగ్గా ఉండాలి. ఒకే చోట గంటల తరబడి కూర్చోకూడదు. ప్రతీ 2 గంటలకు ఒకసారి అటు ఇటు నడవాలి.