Kitchen Hacks: పాలు మరిగించినప్పుడు పొంగిపోతున్నాయా? ఈ ట్రిక్ పాటించండి ..
Milk Boiling Kitchen Hacks: పాలు మరిగించిన ప్రతిసారి గిన్నెలో నుంచి పాలు పొంగిపోయి స్టవ్ పైన పడతాయి. దీంతో స్టవ్ కూడా పూర్తిగా పాడవుతుంది. ఇక క్లీన్ చేయాలంటే అదొక పెద్ద తలనొప్పి.

Milk Boiling Kitchen Hacks: రోజూ ఉదయం అందరి ఇళ్లలో పాలు మరిగించడం తప్పనిసరి. అయితే పాలు మరిగించినప్పుడల్లా అవి పొంగి స్టవ్ పైన పడిపోతాయి. దీంతో అది మళ్ళీ క్లీన్ చేయాలంటే పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఈ బిజీ లైఫ్‌లో ప్రతిరోజు స్టవ్ క్లీన్ చేసుకోవడం అంటే పెద్ద తలనొప్పిగా మారుతుంది. అయితే ఒక్కోసారి మనం పాలు స్టవ్ పై పెట్టి అక్కడే ఉండలేని పరిస్థితులు ఉంటాయి. వేరే పనులు చేయాల్సి వస్తుంది. దీంతో పాలన్నీ స్టవ్, బర్నర్ పైన పడిపోతాయి. ఇలా కాకుండా కొన్ని ట్రిక్స్ పాటిస్తే పాలు అస్సలు పొంగవు.
పాల గిన్నె అంచు వెంబడి నెయ్యి లేదా బట్టర్ పూయాలి. అందులో పాలు పోస్తే మరిగి అస్సలు కింద పడవు. పాలు మరిగిన తర్వాత వాటి బుడగలు ఆ నెయ్యి పరిధి వరకే వస్తాయి. పాలు పొంగి కింద పడిపోవు.
మీరు పాలు మరిగించిన ప్రతిసారి ఒక చెక్క గరిటె లేదా స్టీల్ గరిటె ఆ గిన్నె పైన పెట్టండి. దీంతో పొగ ఆ గరిటే నివారిస్తుంది. పాలు పొంగకుండా ఉంటాయి. ఆ స్పూన్ వరకే వచ్చి ఆగిపోతాయి. చెక్క స్పూన్ అయితే టెంపరేచర్ నియంత్రిస్తుంది. దీంతో పాలు పొంగకుండా ఉంటాయి.
ఒకవేళ మీరు బిజీగా ఉండి పాలు మరిగించాల్సి వస్తే మంట తక్కువ పెట్టి.. తక్కువ మంటపై పాలను మరిగించండి. మీడియం మంటపై మొదటగా ఉడికించి ఆ తర్వాత లో ఫ్లేమ్ పెట్టేయండి. ఇలా చేయడం వల్ల కూడా పాలు పొంగకుండా ఉంటాయి. స్టవ్ బర్నర్ పాడవ్వకుండా ఉంటాయి.
పెద్ద మొత్తంలో పాలు లేదా టీ వేడి చేస్తే పెద్ద గిన్నె తీసుకొని అందులో పాలు వేడి చేయండి. తద్వారా త్వరగా పాలు పొంగకుండా ఉంటాయి. స్టవ్ బర్నర్లు కూడా పాడవ్వవు. ఇలా పాలు, టీ వేడి చేసినప్పుడల్లా పాలు పొంగిపోతే స్టవ్ బర్నర్లు రంధ్రాలు కూడా మూసుకుపోతాయి. తద్వారా మంట కూడా తక్కువగా వస్తుంది. స్టవ్ బర్నర్లు కూడా పూర్తిగా పాడయ్యే అవకాశం ఉంది.