Garlic: పరగడుపున వెల్లుల్లి తింటే.. ఆ 3 రోగాలు పటాపంచలే..!
Garlic On Empty Stomach: వెల్లుల్లి ప్రతి వంటల్లో ఉపయోగిస్తాం. ఇందులో ఔషధ గుణాలు బోలెడు. ఆయుర్వేద పరంగా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వెల్లుల్లి మన డైట్ లో చేర్చుకుంటే ప్రాణాంతక వ్యాధుల నుంచి బయటపడవచ్చు.

Garlic: పరగడుపున వెల్లుల్లి తింటే.. ఆ 3 రోగాలు పటాపంచలే..!
Garlic On Empty Stomach: వెల్లుల్లి పోషకాలకు పవర్ హౌస్. ఇందులో మెడిసినల్ గుణాలు పుష్కలం. అల్లిసిన్ ప్రధానంగా ఉంటుంది. అయితే ఇందులోని సల్ఫర్ కడుప సమస్యలకు చెక్ పెడుతుంది. ప్రతిరోజు వెల్లుల్లి ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం..
పరగడుపున వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. పచ్చి వెల్లుల్లి తింటే ప్రయోజనాలు ఎక్కువ. ఇది శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సీజనల్ జబ్బులు రాకుండా కాపాడుతుంది. జలుబు, దగ్గు నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది.
పచ్చి వెల్లుల్లి తీసుకోవడం వల్ల మనం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతాయి. ఇందులోని సల్ఫర్ మంచి ఉపశమనం కలిగించే గుణాలు ఉన్నాయి. రక్త ప్రసరణను కూడా మెరుగు చేస్తుంది. దీంతో మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ దగ్గర డైట్ లో వెల్లుల్లి తప్పకుండా ఉండేలా చూసుకోండి.
వెల్లుల్లి తీసుకోవడం వల్ల మన శరీరం మంచి డిటాక్స్పై అయిపోతుంది. మన శరీరంలో విష పదార్థాలు బయటకు పోతాయి. అంతే కాదు వెల్లుల్లి ద్వారా జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తి పెంచుతుంది. తద్వారా మన శరీరం క్లెన్స్ అయిపోతుంది.
వెల్లుల్లి జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులోని ఖనిజాలు ప్రాణాంతక బ్యాక్టీరియా శరీరం నుంచి బయటికి పంపించేస్తుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండటం వల్ల ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. కొన్ని రకాల ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులకు కూడా చెక్ పెడుతుంది.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించి.. మంచి కొలెస్ట్రాల స్థాయిలను పెంచుతాయి. వెల్లుల్లిలో యాంటీ డయాబెటిక్ గుణాలు కూడా ఉంటాయి. ఇది షుగర్ని నియంత్రిస్తుంది.
పచ్చి వెల్లులి తీసుకోవడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ముఖంపై ఉండే యాక్నేను సైతం తొలగిస్తుంది. ఆక్సిడేటీవ్ స్ట్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. వీటిని రెగ్యులర్‌గా తినండం వల్ల త్వరగా వృద్ధాప్య ఛాయు కూడా మన శరీరం పై కనిపించవు.