Diabetes: బీకేర్‌ఫుల్.. ఈ 5 పండ్లు షుగర్‌వ్యాధిగ్రస్థులకు విషంతో సమానం..!
Diabetes Must Not Take: డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు సరైన జీవనశైలి పాటించాలి. ప్రధానంగా కొన్ని ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. అయితే, షుగర్‌తో బాధపడుతున్నవారు తినకూడని పండ్లు ఏంటో తెలుసుకుందాం.

Diabetes: బీకేర్‌ఫుల్.. ఈ 5 పండ్లు షుగర్‌వ్యాధిగ్రస్థులకు విషంతో సమానం..!
Diabetes Must Not Take: డయాబెటీస్‌లో కొన్ని పండ్లు తినకూడదు. ప్రధానంగా కార్బోహైడ్రేట్స్, గంజి ఉండే దుంపలకు కూడా దూరంగా ఉండాలి. ఇలాంటివి రక్తంలో చక్కెరస్థాయిలు హఠాత్తుగా పెంచేస్తాయి. డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు తినకూడని 5 పండ్లు తెలుసుకుందాం..
అరటిపండు..
షుగర్‌తో బాధపడుతున్నవారు అరటిపండు పండినది తినకూడదు. ఇందులో గ్లైసెమిక్ సూచీ (GI) కూడా ఎక్కువగా ఉంటుంది. పండిన అరటిపండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.
పుచ్చకాయ..
ఎండాకాలం కడుపులో చల్లదనాన్ని ఇస్తుంది, హైడ్రేషన్ ఇస్తుంది అని షుగర్‌వ్యాధిగ్రస్థలు పుచ్చకాయను తినకూడదు. ఇది షుగర్ స్థాయిలను పెంచుతుంది. ఎందుకంటే ఇందులో చక్కెర అతిగా ఉంటుంది.
మామిడి పండు..
ఇది కూడా ఎండాకాలం ఎక్కువగా దొరుకుతుంది. రుచికరంగా ఉండే మామిడి పండు షుగర్ వ్యాధిగ్రస్థులు తినకూడదు. ఇందులో ఫ్రక్టోజ్, సుక్రోజ్ స్థాయిలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. డయాబెటీస్ వారిక ఇవి విషంతో సమానం.
పైనాపిల్..
పైనాపిల్ రుచికరంగా, సువాసనభరితంగా ఉంటుంది. ఇందులో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. అయితే, పైనాపిల్ రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెంచేస్తాయి.
ద్రాక్ష..
డయాబెటీస్ ఉన్నవారు ద్రాక్షపండ్లను కూడా తినకుండా ఉండటమే మేలు. వీటితో తయారు చేసే కిష్మిశ్ కూడా తినకూడదు. ఇవి చక్కెర స్థాయిలను పెంచేస్తాయి.
డాయబెటీస్‌తో బాధపడుతున్నవారు బాగా పండిన పండ్లను తీసుకోకూడదు. ముఖ్యంగా ఫైబర్ అతిగా ఉండే పండ్లు, కూరగాయలు మాత్రమే తినాలి. లేకపోతే డయాబెటీస్ మరింత ప్రమాదంగా మారుతుంది. అంతేకాదు వీరు డ్రైఫ్రూట్స్ కూడా తినకూడదు. ఆరోగ్యం నిపుణులు అభిప్రాయం ప్రకారం ఏ పండు తిన్నా కొద్ది మొత్తంలో మాత్రమే తీసుకోవాలి. అతిగా తినకూడదు. ఎందుకంటే చక్కెర శాతం శరీరంలో హఠాత్తుగా పెరిగిపోతుంది.
మీరు కూడా షుగర్‌తో బాధపడుతున్నట్లయితే ఆరోగ్యకరమైన డైట్ నిర్వహించాలి. అయితే, అప్పుడప్పుడు మాత్రమే పండ్లు తినాలి. జ్యూస్ అస్సలు తీసుకోకూడదు. పండు ముక్కలు మాత్రమే తీసుకోవాలి. ఒక్కసారిగా ఎక్కువగా తినకుండా ఉండాలి. లేకపోతే షుగర్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.