Rose Water: ఈ నీళ్లు స్ప్రే చేసినా చాలు.. మీ జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..!
Rose Water For Hair Growth: రోజ్ వాటర్ ఇప్పటికే బ్యూటీ రొటీన్‌లో తప్పనిసరిగా ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. రోజ్ వాటర్ వల్ల మీ జుట్టు వద్దన్నా ఆరోగ్యంగా పెరుగుతూనే ఉంటుంది.

Rose Water: ఈ నీళ్లు స్ప్రే చేసినా చాలు.. మీ జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..!
Rose Water For Hair Growth: రోజ్ వాటర్‌ను రోజా పూలతో తయారు చేస్తారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి జుట్టు, చర్మం రొటీన్‌లో చేర్చుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ప్రధానంగా రోజ్ వాటర్ జుట్టుపై ఉపయోగించడం వల్ల డ్యాండ్రఫ్ తగ్గుతుంది. కుదుళ్ల దురదను కూడా తగ్గిస్తుంది. అయితే, మీ జుట్టు పెరుగుదలకు రోజ్ వాటర్‌ను ఎలా ఉపయోగించాలి తెలుసుకుందాం.
హెయిర్ మాస్క్..
ఒక టీ స్పూన్ రోజ్ వాటర్, ఒక చెంచా తేనె లేదా కలబంద జెల్ కలిపి హెయిర్ మాస్క్ తయారు చేసుకోవాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఓ అరగంట తర్వాత పూర్తిగా ఆరిపోతుంది. ఈ తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి.
ఆయిల్..
రోజ్ వాటర్‌తో మనం జుట్టు పెరుగుదలకు సహాయపడే ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి నూనె లేదా ఆముదం నూనెలో ఈ రోజ్ వాటర్ వేసి జుట్టు అంతటికీ పట్టించాలి. సున్నితంగా కుదుళ్లను వేళ్ల సహాయంతో మసాజ్ చేయాలి. దీనివల్ల హెయిర్ ఫొలికల్స్‌కు మంచి పోషణ అందుతుంది.
హెయిర్ మిస్ట్..
రోజ్ వాటర్‌తో హెయిర్ మిస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి ఓ అరకప్పునీళ్లు, ఓ 8 చుక్కల రోజ్ వాటర్ స్ప్రే బాటిల్‌లో వేసి బాగా కలపాలి. ఇందులో మీరు కావాలంటే టీ ట్రీ ఆయిల్ లేదా లావెండర్ ఆయిల్ కలిపితే మంచి అరోమా కూడా వస్తుంది. దీన్ని కావాల్సినప్పుడల్లా హెయిర్ మిస్ట్‌లా వాడుకోవచ్చు.
రోజ్ వాటర్‌ను ఓ కాటన్‌తో డైరెక్ట్‌గా అప్లై చేయవచ్చు. ఇది మన కుదుళ్లకు రక్తప్రసరణ మెరుగు చేస్తుంది. అంతేకాదు కుదుళ్లలో దురద, చుండ్రు కూడా తగ్గించేస్తుంది. అంతేకాదు సగం కప్పు నీళ్లు, మరో సగం కప్పు రోజ్ వాటర్ యాడ్ చేసి తలకు షాంపూతో కడిగిన తర్వాత ఉపయోగించండి.
రోజ్ వాటర్‌ను జుట్టుకు ఈ ఎండాకాలం ఉపయోగించడం వల్ల చెమట వల్ల వచ్చే దుర్వాసనకు కూడా చెక్ పెడుతుంది. మీ హెయిర్ కేర్ రొటీన్‌లో మాత్రమే కాదు స్కిన్ కేర్ రొటీన్‌లో కూడా రోజ్ వాటర్ వాడొచ్చు.