High Protein: ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే ఈ 4 ఆరోగ్య సమస్యలు తప్పవు..!
Protein Side effects: మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ కూడా అవసరం. అయితే ప్రతి బ్రేక్ ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్ లో ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకోవాలి. కానీ, ప్రోటీన్ ఎక్కువ మోతాదు అయితే మాత్రం ఈ నాలుగు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి

High Protein: ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే ఈ 4 ఆరోగ్య సమస్యలు తప్పవు..!
Protein Side effects: సాధారణంగా గుడ్లు, మాంసం, పప్పు ధాన్యాల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మన శరీర ఆరోగ్యానికి ప్రోటీన్ ఎంత అవసరం. అయితే ప్రోటీన్ అతిగా తీసుకోవడం వల్ల అనర్ధాలు తప్పవు. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడంలో కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.
మలబద్దకం..
ప్రోటీన్ ఎక్కువ అవుతే దీర్ఘకాలిక మలబద్దక సమస్య వస్తుంది. అవసరం మేరకు మాత్రమే తీసుకోవాలి. దీంతో పాటు ఫైబర్ ఎంతో ముఖ్యం. లేకపోతే మలబద్ధక సమస్య ఎదురవుతుందని కొన్ని నివేదికలు తెలిపాయి. ప్రధానంగా ఫైబర్ ఉండే ఆహారాలు పిల్లలకు ఎక్కువగా ఇవ్వాలి. దీంతో మలబద్ధక సమస్య తగ్గిపోతుంది . ఫైబర్‌తో పాటు ప్రోటీన్ కూడా అందిస్తూ ఉండాలి
బరువు..
ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు కూడా పెరిగిపోతారు. మోతాదుకు మించి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని క్లినికల్ న్యూట్రిషన్ జర్నల్ ప్రచురించింది. కొంతమంది పై నిర్వహించిన అధ్యయనంలో ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరిగారని తెలిపింది.
కిడ్నీలు పాడవుతాయి..
అంతేకాదు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. ఇది హైపర్ టెన్షన్ కి దారితీస్తుంది. దీంతో కిడ్నీ సమస్యలు వస్తాయి. అంతేకాదు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ప్రోటీన్ ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోకూడదు. వారి పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది.
గుండె సమస్యలు..
ఎన్ఐహెచ్ నివేదిక ప్రకారం 30 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు వారిలో ప్రోటీన్ అధికంగా ఉంటే ప్రాణాంతక వ్యాధులు వెంటాడుతున్నాయి. కార్డియో ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. అందుకే యువత మాత్రమే ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. కానీ 30 దాటిన వారు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు. దీంతో వారికి గుండె సమస్యలు కూడా వస్తాయి. హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. వైద్యులను సంప్రదించి తగిన మోతాదులో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.