Red Fruits: ఈ ఎర్ర పండ్లు తింటే ఏ రోగం రాదు.. 100 ఏళ్లు మీ గుండెకు అండగా ఉండు..!
Red Fruits Health Benefits: కొన్ని ఆహారాలు మీ గుండె ఆరోగ్యానికి గండి కొడితే, మరికొన్ని ఫుడ్స్ మాత్రం గుండెకు రెట్టింపు బలాన్ని పెంచుతాయి. ఈ 7 ఎర్రటి పండ్లు తింటే మీ గుండె బలంగా మారుతుంది.

Red Fruits: ఈ ఎర్ర పండ్లు తింటే ఏ రోగం రాదు.. 100 ఏళ్లు మీ గుండెకు అండగా ఉండు..!
Red Fruits Health Benefits: కార్డియాలజిస్టుల ప్రకారం కొన్ని రకాల ఎరుపు రంగు పండ్లలో గుండెకు మేలు చేసే గుణాలు కలిగి ఉంటాయి. విటమిన్ ఏ, గుండెకు ఆరోగ్యకరమైన లక్షణాలు కలిగి ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత రోగాలు రాకుండా కాపాడతాయి.
ఎరుపు రంగు పండ్లు అంటే ఏమిటి?
ఎరుపు రంగు పండ్లు అంటే ఎర్రని కలర్‌లో ఉంటాయి. ఇందులో లైకోపీన్, ఆంథోనిసైనిన్స్, కెరోటెనాయిడ్స్ ఉంటాయి. ఈ పండ్లు మీ డైట్‌లో చేర్చుకుంటే ఖనిజాలు పుష్కలం.
చెర్రీ పండ్లు..
చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది ఆక్సిడేటీవ్ స్ట్రెస్, బీపీ స్థాయిలను కూడా తగ్గిస్తాయి. ఆక్సిడెటీవ్ స్ట్రెస్ వల్ల గుండె సమస్యలకు దారితీస్తుంది.
స్ట్రాబెర్రీ..
ఈ బెర్రీ పండ్లు రక్తనాళాలను పనితీరును మెరుగుచేస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. ఈ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పాలీఫెనల్స్ ఉంటాయి.
పుచ్చకాయ..
పుచ్చకాయం ఎండాకాలం ఎక్కువగా తింటాం. ఈ పండులో నీటి శాతం కూడా 90 శాతానికి పైగా ఉంటుంది. అయితే, పుచ్చకాయలో కూడా లైకోపీన్ ఉంటుంది. రక్తసరఫరాను మెరుగు చేస్తుంది. కార్డియో సమస్యలు మీ దరిచేరకుండా కాపాడాతాయి.
దానిమ్మ..
ఈ పండులోని గింజలు కూడా ఎర్రని రంగులో ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దానిమ్మలో ఉండే పాలీఫెనల్స్ రక్తసరఫరాను మెరుగు చేస్తాయి. అంతేకాదు అర్టెరీ బ్లాక్స్ రాకుండా కాపాడుతుంది. దానిమ్మను మన రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. బీపీ స్థాయిలు కూడా తగ్గిపోతాయి.
ఎర్ర ద్రాక్ష..
ఎర్ర ద్రాక్షలో రెస్వెవర్టల్ ఉంటుంది. ఇది కూడా అర్టెరీ బ్లాక్స్ ఏర్పడకుండా గుండెకు మేలు చేస్తాయి. అంతేకాదు ఇది కూడా ఆక్సిడేషన్, ఇన్‌ఫ్లమేషన్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి.
రాస్బెర్రీ...
రాస్బెర్రీ కూడా బెర్రీ జాతికి చెందిన పండ్లు. ఇవి కూడా మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించేస్తాయి. కొన్ని నివేదికల ప్రకారం రాస్బెర్రీల్లో ఫైబర్ కూడా పుష్కలం.