Harmanpreet Kaur: ఇండియాలో అత్యంత ధనవంతురలైన మహిళా క్రికెటర్ ఎవరు? ఆమె ఆస్తి ఎన్నికోట్లో తెలుసా?

Harmanpreet Kaur: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రపంచ అత్యుత్తమ మహిళ క్రికెటర్లలో ఒగరుగా నిలిచారు. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్ గా ఆటలో అదరగొడుతున్న హర్మన్ ప్రీత్ సంపాదనలోనూ దూసుకుపోతోంది. భారత రిచెస్ట్ మహిళా క్రికెటర్ గా కొనసాగతున్న హర్మన్ ప్రీత్ కౌర్ నికర విలువ, ఆమె ఆదాయం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
క్రికెట్ లో అద్భుతమైన ప్లేయర్ గా కొనసాగుతూ రికార్డుల మోత మోగించడంతోపాటు సంపాదనలోనూ దూసుకుపోతున్న చాలా మంది క్రికెటర్లు ఉన్నారు.అయితే భారత్ లో రిచెస్ట్ మహిళా క్రికెటర్ ఎవరో తెలుసా. ఎంత సంపాదిస్తున్నారు అనే విషయాలు తెలసుకుంటే..భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌరర్ అత్యంత సంపన్న మహిళా క్రికెటర్ గా నిలిచారు. భారత జట్టును ముందుకు నడిపిస్తున్న కౌర్ పేరు కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది.
హర్మన్ ప్రీత్ కౌర్ క్రికెట్ ప్రయాణం పంజాబ్ నుంచి ప్రారంభమైంది. ఆమె జన్మించింది కూడా పంజాబ్ తోనే. 2009లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం చేసింది. ఆ తర్వాత మహిళల క్రికెట్లో అత్యంత ప్రభావవంతమైన క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ వరకు ఆటలోనూ ప్రతి ఫార్మట్లోనూ ప్రతిభను ప్రదర్శించి తనదైన ముద్ర వేసింది. ఇప్పటి వరకు హర్మన్ ప్రీత్ కౌర్ వన్డేల్లో 3445 పరులు, టీ20 క్రికెట్లో 3112 పరుగులు చేసింది. అలాగే వన్డేల్లో 31 వికెట్లు, టీ20 క్రికెట్లో 32 వికెట్లు తీసింది. మహిళల క్రికెట్లో ఒకే మ్యాచులో 5 వికెట్లు తీసిన బౌలర్లలో హర్మన్ ప్రీత్ కౌర్ ఒకరు. క్రికెట్ హిస్టరీలో అత్యత్తమ మహిళా క్రికెటర్లో ఒకరిగా ఘనత సాధించారు. భారత జట్టు దిగ్గజ క్రికెటర్లు సచిన్, కోహ్లీ, సెహ్వాగ్ ల నుంచి ప్రశంసలను కూడా అందుకున్నారు. 2017లో అత్యుత్తమ మహిళా క్రీడాకారిణిగా అర్జున అవార్డును కూడా అందుకున్నారు.
ఇక హర్మన్ ప్రీత్ కౌర్ ఆస్తుల విషయానికి వస్తే ఆమె నికర విలువ రూ. 25కోట్లు . లిస్ట్ ఏ విభాగంలో ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ కు ఏడాదికి రూ. 50లక్షలు సంపాదిస్తున్నారు. మ్యాచ్ ఫీజులకు కూడా అందుకుంటారు. మహీళల ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లలో రూ. 1.80కోట్లు సంపాదిస్తున్నారు. క్రికెట్ కంటే ఎక్కువగా బ్రాండ్ ఎండార్స్ మెంట్స్, యాడ్స్ ద్వారా ఆదాయం పొందుతున్నారు. హెచ్ డీఎఫ్ సీ లైఫ్ , CEAT, Nike, PUMA, Boost వంటి ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్నారు. అంతేకాదు ముంబై , పాటియాలలో విలాసవంతమైన ఇళ్లు కూడా ఉన్నాయి.