Lifestyle: రోజూ ఈ జ్యూస్‌లు తాగితే.. బీపీ రమ్మన్నా రాదు..
High Blood Pressure: ఇటీవల చాలా మంది బీపీ బారిన పడుతున్నారు. ఒకప్పుడు వయసు పెరిగిన వారిలో మాత్రమే కనిపించిన ఈ సమస్య ఇప్పుడు 30 ఏళ్ల వారిలో కూడా కనిపిస్తోంది. అధిక రక్తపోటు కాలక్రమేణా గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను పెంచుతుంది.

Lifestyle: రోజూ ఈ జ్యూస్‌లు తాగితే.. బీపీ రమ్మన్నా రాదు..
High Blood Pressure: ఇటీవల చాలా మంది బీపీ బారిన పడుతున్నారు. ఒకప్పుడు వయసు పెరిగిన వారిలో మాత్రమే కనిపించిన ఈ సమస్య ఇప్పుడు 30 ఏళ్ల వారిలో కూడా కనిపిస్తోంది. అధిక రక్తపోటు కాలక్రమేణా గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను పెంచుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ప్రకారం ప్రపంచంలో సుమారు 1.28 బిలియన్ల మందికి బిపితో బాధపడుతున్నారు. అయితే కొన్ని రకాల జ్యూస్‌లను తీసుకుంటే రక్తపోటు సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ జ్యూస్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* బీపీని కంట్రోల్ చేయడంలో బీట్‌రూట్ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. బీట్‌రూట్‌లో నైట్రేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తనాళాలను సడలించి బిపిని తగ్గిస్తుంది. ప్రతి రోజు ఒక గ్లాసు బీట్‌రూట్ జ్యూస్ తాగడం మంచిది.
* దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణ మెరుగుపరిచి, బిపి తగ్గించడంలో సహాయపడతాయి.
* క్యారెట్లలో బీటా కెరోటిన్, పొటాషియం ఉంటాయి. ఇవి బిపిని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
* కలబంద శరీరాన్ని శుద్ధి చేస్తుంది. దీని రసం తాగితే రక్తపోటు తగ్గడంతో పాటు చర్మం కూడా నిగారిస్తుంది.
* పాలకూరలో మెగ్నీషియం, నైట్రేట్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను సడలించి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.
* టమోటాలో లైకోపీన్, పొటాషియం ఉంటాయి. ఇవి రక్తపోటు తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
* పుచ్చకాయలో "సిట్రుల్లైన్" అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తనాళాలను విస్తరించి బిపిని తగ్గిస్తుంది. అలాగే శరీరాన్ని డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా చూస్తుంది.
* ఇది జ్యూస్ కాకపోయినా కొబ్బరి నీళ్ళలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. శరీరాన్ని డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా చూడడంలో సహాయపడుతుంది.
* నారింజలో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరచి బిపిని తగ్గిస్తాయి.
గమనిక: ఈ వివరాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.