Heart: గుండె సమస్యలున్న వారు.. మద్యం ఎందుకు తాగకూడదో తెలుసా?
Cardiovascular disease: ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు వేగంగా పెరుగుతున్నాయి. మారిన జీవనశైలి, పెరుగుతున్న పని ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

Heart: గుండె సమస్యలున్న వారు.. మద్యం ఎందుకు తాగకూడదో తెలుసా?
Cardiovascular disease: ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు వేగంగా పెరుగుతున్నాయి. మారిన జీవనశైలి, పెరుగుతున్న పని ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇక గుండె సమస్యల బారిన పడిన వారు ఎట్టి పరిస్థితుల్లో ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. ఆల్కహాల్ నేరుగా గుండె వ్యవస్థను (కార్డియోవాస్కులర్ సిస్టమ్) ప్రభావితం చేస్తుంది. ఇది రక్త ప్రసరణకు అంతరాయం కలిగించడమే కాకుండా హృదయ స్పందన, రక్తపోటును కూడా ప్రభావితం చేస్తుంది.
గుండె సంబంధిత సమస్యలున్న వారు మద్యం తీసుకుంటే రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. నిరంతరం అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్‌కు కారణమవుతుంది. ఆల్కహాల్ అసాధారణ హృదయ స్పందనకు కారణమవుతుంది, ఇది ఆకస్మికంగా గుండె ఆగిపోయడానికి దారితీస్తుంది. గుండె జబ్బు ఉన్నవారు మద్యం తాగితే, వారి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL), ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి. దీనివల్ల ధమనులలో మూసుకుపోయే ప్రమాదం ఉంది. ఇది కరోనరీ ఆర్టరీ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.
అధికంగా మద్యం సేవించడం వల్ల గుండె కండరాలు బలహీనపడి, దాని పంపింగ్ సామర్థ్యం తగ్గుతుంది. ఎక్కువ కాలం మద్యం సేవించే వారిలో గుండె ఆగిపోయే ప్రమాదం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. గుండె జబ్బులు ఉన్నవారు మద్యం తాగితే, అది వారి రక్తాన్ని చిక్కగా చేసి, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. దీని కారణంగా, బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
గుండె సంబంధిత సమస్యల బారినపడి అందుకు సంబంధించిన మెడిసిన్ తీసుకుంటున్న వారు కూడా మద్యానికి దూరంగా ఉండాలి. గుండె సంబంధిత మందులు వేసుకునే వారు మద్యం తాగితే మందుల ప్రభావం ఉండదు. ఆల్కహాల్ శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది. ఇది డీహైడ్రేషన్ సమస్యను పెంచుతుంది. దీని కారణంగా గుండె పనితీరు దెబ్బతింటుంది. ఆల్కహాల్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది వేగంగా బరువు పెరగడానికి కారణమవుతుంది. అధిక బరువు గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.
అయితే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు రెడ్ వైన్‌ను పరిమిత పరిమాణంలో తీసుకుంటే. అది గుండెకు మేలు చేస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. రెడ్ వైన్‌లో రెస్వెరాట్రాల్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ధమనులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే దాని పరిమితిని చాలా తక్కువ పరిమితిలో తీసుకోవాలి. అదే విధంగా ముందు వైద్యుల సలహా కచ్చితంగా తీసుకోవాలి.