ఇండియాలో కొత్తగా లాంచ్ అయిన డ్రగ్... రూ. 3,500 డ్రగ్‌తో బరువు తగ్గిస్తామంటున్న కంపెనీ
Weight-loss drug Mounjaro cost in India: ఇండియాలో ప్రస్తుతం 10 కోట్ల మందికిపైనే భారతీయులు డయాబెటిస్, ఒబేసిటీ బాధితులు..

ఇండియాలో కొత్తగా లాంచ్ అయిన డ్రగ్... రూ. 3,500 డ్రగ్‌తో బరువు తగ్గిస్తామంటున్న కంపెనీ
అమెరికాకు చెందిన ఎలీ లిల్లీ అనే డ్రగ్ కంపెనీ ఇండియాలో గురువారం కొత్తగా మౌంజారో అనే డ్రగ్ ను లాంచ్ చేసింది. అధిక బరువు తగ్గించేందుకు ఈ మెడిసిన్ ఉపయోగడుతుందని ఎలీ లిల్లీ కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే అమెరికాతో పాటు యూకే, యురప్ దేశాల్లో డయబెటిస్ తో పాటు అధిక బరువు తగ్గించడంలో ఎలీ లిల్లీ బ్రాండ్ మెడిసిన్ కు బ్లాక్ బస్టర్ డ్రగ్ గా పేరుంది. అయితే, ఇండియాలో కూడా డయాబెటిస్, ఒబెసిటీ కేసులు భారీగా పెరుగుతుండటంతో తమ డ్రగ్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడం మరింత కలిసొస్తుందని ఆ కంపెనీ భావిస్తోంది.
ధరలు ఎలా ఉన్నాయంటే.
అధిక బరువును తగ్గించే మెడిసిన్‌గా చెబుతున్న ఈ మౌంజారో ఔషదానికి 5MG వయల్‌కు ఆ కంపెనీ రూ. 4,375 చార్జ్ చేస్తోంది. 2.5 MG వయల్ తీసుకునే వారికి రూ. 3,500 చార్జ్ చేయనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.
"ఇండియాలో ప్రస్తుతం 10 కోట్ల మందికిపైనే భారతీయులు డయాబెటిస్, ఒబేసిటీతో బాధపడుతున్నారని, రాబోయే రోజుల్లో భారత్‌కు ఇదే పెద్ద సవాల్" అని లిల్లీ ఇండియా జనరల్ మేనేజర్ విన్‌స్లూ టకర్ అభిప్రాయపడ్డారు.
మౌంజారో అనే ఈ ఔషదం రసాయనిక నామం టైర్జెపటైడ్. యూకే, యూరప్ దేశాల్లో అదే పేరుతో మార్కెట్లో లభిస్తోంది. అమెరికాలో మాత్రం జెప్‌బౌండ్ పేరుతో ఒబేసిటీకి మందుగా విక్రయిస్తున్నారు.
2025 ఆరంభంలోనే మౌంజారో ఔషదాన్ని ఇండియాలో లాంచ్ చేస్తామని ఎలీ లిల్లీ సీఈఓ డేవిడ్ రిక్స్ గతేడాది ఫిబ్రవరిలో రాయిటర్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తాజాగా ఇండియాలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) అనుమతి ఇవ్వడంతో ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
2030 నాటికి స్తూలకాయాన్ని తగ్గించే ఔషదాల వ్యాపారం ఏడాదికి 150 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచాన్ని ఒబేసిటీ ఎంతలా పట్టిపీడిస్తుందో ఈ ఒక్క లెక్కను బట్టే అర్థం చేసుకోవచ్చు.