Pregnancy Tips: ఈ రోజుల్లో కలిస్తే.. గర్భం ధరించడం ఖాయమట..!
Pregnancy Tips:నేటికాలంలో ఎంతో మంది జంటలు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం స్త్రీ,పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లోపాలు, సమస్యలే కారణమని కొంతమంది అంటుంటే..మరో కారణం కూడా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ కారణమేంటో తెలుసుకుందామా?
Pregnancy Tips: జీవనశైలిలో మార్పులతో చాలా మంది జంటలు పిల్లలు కలగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లోపాలు, సమస్యల వల్లే ఇలా జరుగుతుందంటున్నారు. కానీ మరో కారణం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అదే అండం విడుదలయ్యే సమయం. దీన్ని సరిగ్గా గుర్తించకపోవడం. ఈ సమయంలో కలయికలో పాల్గొన్నా చాలా మంది గర్భం దాల్చలేకపోతున్నారని చెబుతున్నారు. అండం విడుదలయ్యే తేదీని కచ్చితంగా గుర్తించి ఓ ప్రణాళిక ప్రకారం కలయికలో పాల్గొంటే ఫలితం ఉంటుందంటున్నారు. దీనికి స్మెర్మ్ మీట్ ఎగ్ ప్లాన్ పద్దతి దోహదం చేస్తుందని చెబుతున్నారు. అసలు ఏంటా ప్రణాళికా? సంతాన ప్రాప్తిలో ఎంత వరకు తోడ్పడుతుంది? తెలుసుకుందాం.
మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 60 నుంచి 80 మిలియన్ల జంటలు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాటిలో 25శాతం మంది..సుమారు 15 నుంచి 20 మిలియన్ల మంది భారతీయులే ఉండటం కలవరపెడుతోంది. అయితే దీనికి ఇద్దరి ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్న లోపాలు, సమస్యలు, అనారోగ్యాలతో పాటు అండం విడుదలయ్యే తేదీని సరిగ్గా గుర్తించలేకపోవడం కూడా ఒక కారణం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే సరైన తేదీల్లో కలయిక జరగనట్లయితే పిల్లలు పుట్టే అవకాశాన్ని కోల్పోతున్నారని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో స్మెర్మ్ మీట్ ఎగ్ ప్లాన్ పద్దతి జంటలకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
ప్లాన్ ఎలా చేసుకోవాలి?
గర్భధారణ జరగాలి అంటే..అండం రిలీజ్ అయ్యే తేదీల్లో జంటలు కలయికలో పాల్గొనడం చాలా ముఖ్యం. అయితే ఈ సమయాన్ని గుర్తించడంలో జంటలు సక్సెస్ కావడం లేదు. ఇంకొందరు తమ రుతుచక్రాన్ని బట్టి అండం విడుదల తేదీని లెక్కించుకుని ఆరోజు మాత్రమే కలిస్తే సరిపోతుందనుకుంటున్నారు. ఆ విధంగా కాకుండా ముందే ఒక ప్లాన్ చేసుకుని ముందుకు సాగినట్లయితే సక్సెస్ రేటు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీర్యం అండంతో కలవాలంటే పీరియడ్స్ ప్రారంభమైన 8వ రోజు నుంచే కలయిలో పాల్గొనాలని చెబుతున్నారు. ఈ క్రమంలో కొన్ని ముఖ్యమైన రోజులను గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు.
-చాలా మందిలో 28 రోజుల రుతుచక్రం ఉంటుంది. ఇలాంటి వారు పీరియడ్స్ ప్రారంభమైన 8వ రోజు నుంచే కలయికలో పాల్గొనాలి.
-10వ రోజు నుంచి రోజూ ఇంట్లోనే స్వయంలో ఒవ్యులేషన్ టెస్టు చేసుకోవాలి. దీనికోసంప్రత్యేక కిట్స్ మార్కెట్లో లభ్యం అవుతాయి. ప్రెగ్నెన్సీ టెస్టును పోలినట్లుగా ఉంటుంది ఈ పరీక్ష. మహిళల తమ యూరిన్ ద్వారా దీన్ని పరీక్షించుకోవచ్చు. మూత్రంలో లుటనైజింగ్ హార్మోన్ లెవల్స్ పెరిగితే..అది అండం విడుదలవ్వడానికి సూచిక అని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కిట్ పై ఉన్న గీత ముదురు రంగులో కనిపిస్తుంది.
-10వ రోజు పాజిటివ్ వస్తే ఆరోజు 11వ రోజు, 12వ రోజు, ఇలా వరుసగా మూడురోజులపాటు కలయికలో పాల్గొనాలి.
-ఆ తర్వాత మధ్యలో 13వ రోజు వదిలేసి 14 వరోజు మరోసారి కలవాలని చెబుతున్నారు. నెలసరి ముగిసిన 8 నుంచి 14వ రోజు వరకు కలయికలోపాల్గొంటే వీర్యం అండంతో కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ప్లాన్ ప్రకారం కలయికలో పాల్గొంటే గర్భధారణ సక్సెస్ రేటు చాలా వరకు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.