Health Tips: శీతాకాలంలో మానసిక సమస్యలను దూరం చేస్తాయ్.. ఈ పండ్లను రోజూ తినండి..!
Health Tips: చలికాలంలో మీ ఆహారంలో సీజనల్ పండ్లను తీసుకోవడం రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Health Tips: చలికాలంలో మీ ఆహారంలో సీజనల్ పండ్లను తీసుకోవడం రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరంలో విటమిన్ డి లేకపోవడం వల్ల చలికాలంలో డిప్రెషన్‌కు గురవుతుంటారు. విటమిన్ డి అధికంగా ఉండే పండ్లను ప్రతి రోజూ తినండి. సీజన్‌లో ఉండే పండ్లు ఎల్లప్పుడూ మంచివి, అవి మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి, ఇవి వైరల్ ఇన్‌ఫెక్షన్లు ,పొడి చర్మం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు సహాయపడతాయి. ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం.
ఆరెంజ్:
ఆరెంజ్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నారింజలు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి అలాగే సెరోటోనిన్‌ను పెంచడంలో సహాయపడతాయి. కాబట్టి మానసిక స్థితి బాగుండాలంటే నారింజ పండ్లను తినండి. నారింజ పండ్లను తీసుకోవడం వల్ల క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కివీ:
చలికాలంలో సాధారణంగా లభించే పండు, కివీలో విటమిన్ సి, ఐరన్, ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు వంటి వివిధ పోషకాలు ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, భాస్వరం, రాగి, జింక్, ఇనుము వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి.
స్ట్రాబెర్రీలు:
ఈ పండ్లలో ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.
ద్రాక్ష:
అత్యంత పోషక విలువలు కలిగిన పండ్లలో ద్రాక్ష ఒకటి. ద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది మీ జీర్ణవ్యవస్థకు మంచిది. వీటిలో ఉండే సహజమైన ఫైటోకెమికల్స్ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
అరటిపండు:
అరటిపండు శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అరటిపండ్లలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
యాపిల్స్:
చలికాలంలో ఎక్కువగా లభించే పండ్లలో ఆపిల్ ఒకటి. యాపిల్స్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వాటిలో పెక్టిన్ ఉంటుంది, ఇది పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. యాపిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెపోటు, ఇంకా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.