Pregnant Tips: సంతానం కలగాలంటే..ఈ పోషకాలు తప్పనిసరి.!

Pregnant Tips: అమ్మా..అనిపించుకోవాలని ఎంతో మంది మహిళలు పరితపిస్తుంటారు. జీవనశైలి, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సమస్యల వల్ల నేటికాలంలో ఎంతో మంది స్త్రీలు అమ్మతనానికి దూరం అవుతున్నారు. ఇంకొంతమంది ఐవీఎఫ్, అద్దెగర్భం వంటి పద్దతుల్లో తల్లులుగా మారుతున్నారు. అసలు సంతానం కలగకపోవడానికి కారణాలేంటి. ఎలాంటి పోషకాలు తీసుకుంటే సంతానం కలుగుతుంది. తెలుసుకుందాం.

Update: 2024-06-22 07:13 GMT

Pregnant Tips: సంతానం కలగాలంటే..ఈ పోషకాలు తప్పనిసరి.!

Pregnant Tips: అమ్మా అనే పిలుపుకోసం ఎంతోమంది మహిళలు ఎదురుచూస్తుంటారు. కానీ నేటికాలంలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి ప్రత్యుత్పత్తి వ్యవస్థలో వచ్చే సమస్యల కారణంగా అమ్మతనానికి దూరమవుతున్నారు. ఇంకొందరు ఐవీఎఫ్, అద్దె గర్భం వంటి పద్దతుల ద్వారా అమ్మలవుతున్నారు. అయితే మనం తీసుకునే ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి..ఈ రెండు కూడా గర్భం ధరించడంలో కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్రమంలో పోషకాలతో నిండిన పదార్థాలు రోజువారీ డైట్లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. మరి సంతాన భాగ్యాన్ని ప్రసాదించే ఆ పోషకాలేంటో తెలుసుకుందామా?

నెలసరి సరిగ్గా రాకపోవడం, థైరాయిడ్, పీసీఓఎస్, అధిక బరువు, హార్మోన్ల అసమతుల్యత ఇవ్వన్నీ కూడా గర్భం ధరించాలనుకునే మహిళలకు ఇబ్బందిగా మారుతున్నాయి. అయితే చక్కటి జీవనశైలితో ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. ఆరోగ్యకరమైన పోషకాలను తీసుకుంటే సంతానానికి మార్గం సులభంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు.

అండం నాణ్యత పెరగాలంటే:

ప్రెగ్నెన్సీ రావాలంటే అండం విడుదల ఎంత ముఖ్యమూ...దాని నాణ్యత కూడా అంతే ముఖ్యం. అయితే మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ అండాశయాల్లో ఉత్పత్తయ్యే అండాల ఆరోగ్యం చెడు ప్రభావం చూపుతాయి. ఆ సమస్యను తగ్గించుకోవాలంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోమని చెబుతున్నారు నిపుణులు. విటమిన్లు సి, ఇ, ఫొలేట్, బీటా కెరోటిన్, ల్యూటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కాయకూరలు, నట్స్, ధాన్యాలను రోజువారీ డైట్లో చేర్చుకోవాలి. వీర్యకణాల నాణ్యత పెరగాలన్నా వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ముఖ్యం.

ఇలాంటి ఫుడ్స్ జోలికి వెళ్లకండి:

ఈ మధ్యకాలంలో చాలా మంది జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఇందులో చెడు కొవ్వులు ఉంటాయి. ఇవి రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచి అండోత్పత్తి, గర్భదారణపై చెడు ప్రమాదం చూపుతాయి. బేకరీఐటమ్స్, ఫ్రైడ్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. పాలు, పాల ఉత్పత్తులు, ప్రొటీన్లు, మాంసాహారం, చేపలు తీసుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిలో ఉండే మంచి కొవ్వులు సంతాన సమస్యలను దూరం చేసి గర్భం దాల్చేందుకు దారి చూపుతాయి.

ఇక చాలా మంది పీసీఓఎస్ సమస్యను ఎదుర్కొంటున్నవారిలోనూ సంతాన సమస్యలు ఉన్నాయి.ఈ సమస్యను తగ్గించుకునేందుకు ఆహారంలో తక్కువ కార్బొహైడ్రేట్లు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ స్థాయిలో అదుపులో ఉంటాయి. నెలసర కూడా రెగ్యులర్ గా వస్తుంది. ఇవన్నీ జరిగితే సంతానాన్ని నోచుకోవడం పెద్ద కషం కాదంటున్నారు నిపుణులు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.



Tags:    

Similar News