Coffee Benefits: రోజూ కాఫీ తాగండి..ఆయుష్షును పెంచుకోండి.!

Coffee Benefits: నేటి బిజీలైఫ్ కారణంగా చాలామంది ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం లేదు. దీంతో అనారోగ్యం బారినపడుతున్నారు. గంటలతరబడి కూర్చోవడం, శారీరక వ్యాయామం లేకపోవడంతో సమస్యలు దరిచేరుతున్నాయి. అయితే ఎక్కువసేపు కూర్చొన్నప్పటికీ రోజూ కాఫీ తాగితే మరణ ముప్పును తగ్గించుకుని ఆయుష్షును పెంచుకోవచ్చని ఓ అధ్యయనం తేల్చి చెప్పింది.

Update: 2024-06-25 03:06 GMT

Coffee Benefits: రోజూ కాఫీ తాగండి..ఆయుష్షును పెంచుకోండి.!

Coffee Benefits:నేటికాలంలో చాలా మంది గంటలతరబడి కూర్చొంటున్నారు. ముఖ్యంగా డెస్కు ఉద్యోగాలు చేసేవారు గంటలతరబడి కూర్చులకే అతుక్కుపోతున్నారు. దీంతో వారు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే ఎక్కువ సేపు కూర్చొన్నప్పటికీ రోజూ కాఫీ తాగడం వల్ల మరణ ముప్పును తగ్గించుకుని ఆయుష్షును పెంచుకోవచ్చని తాజాగా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. ఈ విషయంలో కాఫీ ఆశ్చర్యకరమైన ఆయుధంగా పనిచేస్తుందని పరిశోధకులు అంటున్నారు. కాఫీ తాగని వారితో పోలిస్తే..ఎక్కువ సేపు కూర్చుని ఉన్నప్పటికీ..రోజూ కాఫీ తాగేవారు పలు కారణాల వల్ల మరణించే ముప్పు నుంచి తప్పించుకుంటున్నారని అధ్యయనం వివరించింది.

దాదాపు 10వేల మందిపై జరిపిన ఈ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నిశ్చల జీవనశైలి కలిగి కాఫీ తాగే అలవాటు ఉండేవారిలో గుండెసంబంధిత సమస్యలతో మరణించే ముప్పు తక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. ఎక్కువసేపు కూర్చుని కాఫీ తాగని వారితో పోలిస్తే రోజుకు 2.5కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగే వారిలో మొత్తంగా మరణాల ముప్పు తక్కువగా ఉందని పరిశోధకులు ఈ అధ్యయనంలో తేలిపారు. ఈ అధ్యయనం వివరాలను సైన్స్ అలర్ట్ లో ప్రచురించారు.

కాఫీ తాగడం వల్ల ప్రయోజనాలు:

కాఫీని తాగితే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాఫీలో కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి కొన్ని రకాల వ్యాధులకు చెక్ పెడతాయి. ఒక కప్పు కాఫీ తాగడం వల్ల ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి. శరీరంలో జీవక్రియలు చురుగ్గా ఉండేందుకు కాఫీ ఉపయోగపడుతుంది. అయితే ఒక్క కప్పు కాఫీ తాగితే ఈ ప్రయోజనం పొందవచ్చు. తక్కువ కాఫీ తాగడం వల్ల లివర్ కు రక్షణగా ఉంటుంది. హార్ట్ స్ట్రోక్స్, నరాలను ఉత్తేజపరచడం, మతిమరుపు, వంటి వాటికి కాఫీతో చెక్ పెట్టవచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.


Tags:    

Similar News