Wearing Hat Facts: టోపీ పెట్టుకుంటే బట్టతల వస్తుందా..!

Wearing Hat Facts: టోపీ పెట్టుకున్నా, హెల్మెట్‌ పెట్టుకున్నా బట్టతల వస్తుందని కొందరు నమ్ముతారు. ఇంకొంత మంది జుట్టు ఊడిపోతుందని చెబుతున్నారు.

Update: 2023-11-20 15:30 GMT

Wearing Hat Facts: టోపీ పెట్టుకుంటే బట్టతల వస్తుందా..!

Wearing Hat Facts: టోపీ పెట్టుకున్నా, హెల్మెట్‌ పెట్టుకున్నా బట్టతల వస్తుందని కొందరు నమ్ముతారు. ఇంకొంత మంది జుట్టు ఊడిపోతుందని చెబుతున్నారు. ఇలాంటి అనుమానాలు చాలామందిని వెంటాడుతున్నాయి. మనిషికి జుట్టు వల్ల అందం, ఆత్మవిశ్వాసం రెండు పెరుగుతాయి. ఆడ అయినా మగ అయినా జుట్టు రాలుతుందంటే చాలా కుంగిపోతారు. ఇక పెళ్లికాని వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఈ కారణం వల్ల వారు డిప్రెషన్‌లోకి వెళుతారు. వాస్తవానికి టోపీ పెట్టుకోవడం వల్ల బట్టతల వస్తుందా లేదా ఈ రోజు తెలుసుకుందాం.

నిజానికి జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. హార్మోన్లలో తేడాలు, జన్యు పరమైన మార్పులు, తీసుకునే ఆహారం వల్ల జుట్టు రాలి పోతుంది. కేవలం టోపీ పెట్టుకోవడంవల్ల జుట్టు రాలి పోతుందని అనుకోవడం అపోహని డాక్టర్లు చెబుతున్నారు. టోపీ పెట్టుకునేది తల వేడెక్కకుండా ఉండటం కోసం మాత్రమే కానీ బిగుతుగా ఉండే టోపీలు పెట్టుకోవద్దని గుర్తుంచుకోండి. దీనివల్ల చెమట పెరిగి బాక్టీరియా వృద్ధి చెందుతుంది.

సరైన నిద్ర లేకపోయినా జుట్టు రాలుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. నిద్ర సరిగ్గా లేకపోతే మానసిక ఒత్తిడి పెరిగి ఆ ప్రభావం జుట్టుపై పడుతుంది. ఒత్తిడి వల్ల హార్మోన్లు అనేవి ఇన్ బ్యాలెన్స్ అవుతాయి. దీంతో జుట్టు ఊడి పోతూ ఉంటుంది. ప్రతి రోజూ 7 గంటల నుంచి 8 గంటలు నిద్ర పోవాలి. జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ తినడం వల్ల జుట్టుకు రక్తప్రసరణ అందదు. కుదళ్లు బలహీనంగా మారి జుట్టు రాలడం మొదలవుతుంది. వ్యాయామం చేయక పోవడం వల్ల తలపై రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీంతో జుట్టు రాలిపోయే అవకాశాలు ఉంటాయి. మహిళలు గర్భ నిరోధక మాత్రలు వాడినా జుట్టు రాలి పోతుంది.

Tags:    

Similar News