Egg Yolk: గుడ్డులోని పచ్చసొన తింటే కొవ్వు పెరుగుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
Egg Yolk: గుడ్డు ఒక సంపూర్ణ ఆహారం. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వైద్యులు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు గుడ్డు తినమని చెబుతారు.
Egg Yolk: గుడ్డు ఒక సంపూర్ణ ఆహారం. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వైద్యులు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు గుడ్డు తినమని చెబుతారు. కాకపోతే కొంతమందికి గుడ్డులోని పచ్చసొన తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని నమ్ముతారు. అయితే నిజంగా నే కొవ్వు పేరుకుపోతుందా అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం.
గుడ్డులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ B2, B12, విటమిన్ A, D, అయోడిన్, సెలీనియం, బయోటిన్, ఫాస్పరస్, జింక్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి కండరాలను బలోపేతం చేయడమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గుడ్డులోని తెల్లసొనలోనే కాకుండా పచ్చసొనలో జింక్, ఫాస్పరస్ సహా అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. జలుబు, దగ్గు ఉన్నప్పుడు గుడ్లు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.
గుడ్డులోని పసుపు భాగంలో అధిక మొత్తంలో కొవ్వు ఉంటుంది దీని అధిక వినియోగం బరువు పెరుగుతుందని, అందువల్ల రోజుకు ఒక గుడ్డు పచ్చసొన మాత్రమే తినడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మీరు బరువు తగ్గించే క్రమంలో ఉంటే పచ్చసొన తినకూడదని చెబుతున్నారు. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 2 నుంచి 3 గుడ్లు తినవచ్చు. అయితే ఇది శరీర బరువు, వయస్సు, జీర్ణశక్తిపై ఆధారపడి ఉంటుంది. గుడ్డులో మంచి కాల్షియం ఉంటుంది. కాబట్టి దాని వినియోగం ఎముకలను బలోపేతం చేయడానికి సాయపడుతుంది. ఇందులో ఉండే ప్రొటీ న్లు, ఇతర పోషకాలు శక్తిని పెంచడానికి, కండరాలను బలోపేతం చేయడానికి పని చేస్తాయి.