Health Tips: చికెన్ తింటే మంచిదా..లేక కోడిగుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిదా..? ఈ రెండింటిలో ఎందులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి..?
మానవ శరీరానికి ఎంతో అవసరమైనవి ప్రోటీన్లు. మన శరీరంలో కండరాల నిర్మాణానికి అదేవిధంగా మన శరీరంలో శక్తికి కూడా ప్రోటీన్లు అత్యంత అవసరమైనవి. అలాంటి ప్రోటీన్లు ఎక్కువగా మాంసాహారంలో లభిస్తాయి అని చెప్తూ ఉంటారు ఆరోగ్య నిపుణులు. అయితే మనం అందరం ప్రోటీన్ల కోసం ఎక్కువగా కోడిగుడ్లు, చికెన్ తినేందుకు ఇష్టపడుతూ ఉంటాము. అయితే ఈ రెండింటిలో ఏది తింటే ప్రోటీన్ అధికంగా లభిస్తుంది వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చాలా మంది చికెన్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. కానీ ఇందులో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుందని చెబుతుంటారు. ముందుగా చికెన్ లో ఉండే పోషకాల గురించి తెలుసుకుందాం. 100 గ్రాముల చికెన్ తింటే 143 కేలరీలు లభిస్తాయి. అలాగే 100 గ్రాముల చికెన్‌లో 24.11 గ్రాముల ప్రోటీన్, 2.68 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 3.12 గ్రాముల కొవ్వులు ఉంటాయి. ఇది కాకుండా, చికెన్‌లో కాల్షియం, ఐరన్, సోడియం, విటమిన్ ఎ అధికంగా ఉంటుంది.
మీ శరీరానికి ఎంత ప్రోటీన్ లభిస్తుంది అనేది మీరు తినే చికెన్‌లో భాగాన్ని బట్టి ఉంటుంది. మీరు బరువు తగ్గాలని, కండరాలను పెంచుకోవాలనుకుంటే, చికెన్ బ్రెస్ట్ తినండి. చికెన్ బ్రెస్ట్‌లో కేలరీలు, కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మీరు తక్కువ కార్బ్ లేదా కీటోజెనిక్ డైట్‌లో ఉంటే లేదా బరువు పెరగడానికి ప్రయత్నిస్తుంటే, చికెన్ లెగ్స్, వింగ్స్ తినాలి.
కోడి గుడ్డు గురించి తెలుసుకోండి:
100 గ్రాముల ఉడికించిన గుడ్డులో 155 కేలరీలు ఉంటాయి. ఇందులో 12.58 గ్రాముల ప్రోటీన్, 1.12 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 10.61 గ్రాముల కొవ్వులు ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం, గుడ్లలో పెద్ద మొత్తంలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. గుడ్డు వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగదు. అందువల్ల, చాలా మంది పోషకాహార నిపుణులు ఉడికించిన గుడ్లను తినమని సలహా ఇస్తున్నారు.
గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
గుడ్లలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం, ఫ్లోరైడ్, విటమిన్-ఎ, విటమిన్-బి కాంప్లెక్స్, విటమిన్ కె ఉన్నాయి. గుడ్డు పచ్చసొనలో లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గుడ్లు పోషకాహారాన్ని అందించడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. కండరాలు పెరుగుతాయి. గుడ్డు రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది.
ఇండియన్ డెర్మటాలజీ ఆన్‌లైన్ జర్నల్‌లోని ఒక అధ్యయనం ప్రకారం, పౌరుల ఆహారంలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. మనం ప్రొటీన్లు తక్కువగానే తింటాం. ప్రొటీన్ లోపం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీరు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అనేది మీ బరువు మీద ఆధారపడి ఉంటుంది. మీ బరువు 50 కిలోలు ఉంటే, మీ శరీరానికి ప్రతిరోజూ 40 గ్రాముల ప్రోటీన్ అవసరం. రోజూ తగిన మోతాదులో ప్రొటీన్ తీసుకోవడం వల్ల అనారోగ్యం తగ్గుతుంది. మీరు చికెన్ లేదా గుడ్లు తినకపోతే, మీరు ప్రోటీన్ కలిగిన శాఖాహార ఆహారాలు తినవచ్చు.