Pink Pineapple: మీకు పింక్‌ పైనాపిల్‌ గురించి తెలుసా.? ఇంతకీ వీటి కథేంటంటే..

అయితే ఈ పింక్‌ పైనాపిల్ లభించడం అంత సులభమైన విషయం కాదు.

Update: 2024-09-24 06:29 GMT

pink pineapple: మీకు పింక్‌ పైనాపిల్‌ గురించి తెలుసా.? ఇంతకీ వీటి కథేంటంటే.. 

Pink Pineapple: సాధారణంగా మనకు తెలిసిన పైనాపిల్స్‌ యల్లో కలర్‌లో ఉంటాయి. అయితే పింక్ పైనాపిల్స్ ఎప్పుడైనా చూశారా.? లేదా కనీసం ఎప్పుడైనా విన్నారా.? అదేంటి పైనాపిల్‌ పింక్‌ కలర్‌లో ఉండడం ఏంటని అనుకుంటున్నారు కదూ! అయితే నిజంగానే పింక్‌ పైనాపిల్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఏంటీ పింక్‌ పైనాపిల్స్‌. ఇవి ఎక్కడ లభిస్తాయి.? వీటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలు పింక్‌ పైనాపిల్‌ జ్యూసీగా ఉంటుంది.

అయితే ఈ పింక్‌ పైనాపిల్ లభించడం అంత సులభమైన విషయం కాదు. జన్యుపరమైన మార్పులు చేయడం వల్ల ఈ పింక్‌ పైనాపిల్‌ను తయారు చేస్తారు. ఈ పైనాపిల్‌ను డెల్‌ మోంటే అనే ఒక్క కంపెనీ మాత్రమే ఈ పైనాపిల్‌ను తయారు చేస్తుంది. ఈ కంపెనీ 2015లో 'రోస్‌' పేరుతో పింక్‌ పైనాపిల్‌కు పేటెంట్ రైట్ పొందింది. పింక్‌గ్లో పేరుతో వీటిని విక్రయిస్తారు. అయితే ఈ పండ్లు కేవలం దక్షిణ-మధ్య కోస్టా రికాలోని ఒక పొలంలో పండిస్తారు. అగ్నిపర్వతాల్లోని నేల, ఉష్ణమండల వాతావరణంలో ఈ గులాబీ ఫినాపిల్స్ పండుతాయి.

ఈ పింక్‌ పైనాపిల్స్‌ను కాండం లేకుండానే రవాణా చేస్తారు. ఈ తాజా కాండం మళ్ళీ కొత్త పింక్‌ పైనాపిల్‌ విత్తుగా నాటడానికి ఉపయోగిస్తారు. ఈ పింక్ పైనాపిల్స్ అమెరికా, కెనడాలో మాత్రమే లభ్యమవుతాయి. రెగ్యుర్‌ పైనాపిల్‌ ధరతో పోల్చితే ఈ పింక్‌ పైనాపిల్ ధర ఎక్కువగా ఉంటుంది. ఈ పండు ధర ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం పింక్ పైనాపిల్స్ పెరగడానికి దాదాపు రెండేళ్లు పడుతుంది. అంతేకాకుండా ఈ ఫ్రూట్‌ కేవలం కోస్టా రికాలోని ఒక పొలంలో మాత్రమే పండిస్తారు.

తక్కువ దిగుబడి ఉంటుంది కాబట్టే ఈ పండుకు ధర ఇంత ఎక్కువగా ఉంటుంది. ఈ పండుకు పేటెంట్‌ హక్కు ఉండడంతో ఈ పండును ఎక్కడ పెంచకూడదనే నిబంధన ఉంది. ఈ పండు కేవలం రెండు రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. ఇక పింక్‌ పైనాపిల్‌ ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Tags:    

Similar News