Smart Watch: స్మార్ట్‌వాచ్‌లు నిజంగానే ఆరోగ్యం గురించి హెచ్చరిస్తున్నాయా.. నిజాలు ఏంటంటే..?
Smart Watch: ఈ రోజుల్లో స్మార్ట్ వాచ్‌ల వాడకం విపరీతంగా పెరిగింది.
Smart Watch: ఈ రోజుల్లో స్మార్ట్ వాచ్‌ల వాడకం విపరీతంగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్స్ ఉన్నప్పట్టికీ వీటివల్ల కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉండటంతో ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ వాచ్‌లు ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి పనిచేస్తున్నాయి. ఈ ఒక్క కారణంతో వీటిని వాడే సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. అంతేకాదు కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్స్‌తో స్మార్ట్ వాచ్‌లని విడుదల చేస్తున్నాయి.
అయితే ఆరోగ్యానికి సంబంధించి నిపుణులు కొన్ని విషయాల గురించి హెచ్చరిస్తున్నారు.స్మార్ట్ వాచ్ ద్వారా వచ్చిన ఫలితం పూర్తిగా కచ్చితమని నిర్ధారించలేమని చెబుతున్నారు. ఎందుకంటే అది వాచ్‌లోని ఛార్జింగ్ పై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే స్మార్ట్‌వాచ్‌లు వ్యక్తిలో కర్ణిక దడ (ఎ ఎఫ్ ఐ బి)ని గుర్తించగలవని కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు. అయినప్పటికీ వాటి వినియోగానికి పరిమితులు ఉన్నాయని వైద్య పరికరాలతో రోగనిర్ధారణ చేయడంతో పోలిస్తే స్మార్ట్ వాచ్ లు అంత కచ్చితమైన సాధనం కాదని మాత్రం హెచ్చరిస్తున్నారు.
వాస్తవానికి స్మార్ట్ వాచ్ అనేది స్క్రీనింగ్ సాధనం, రోగనిర్ధారణ సాధనం కాదని వైద్య నిపుణులు అంటున్నారు. గతంతో పోలిస్తే ఫలితాలు మెరుగ్గా అందిచడంలో యాప్‌లు మెరుగయ్యాయని, కాని మరింత కచ్చితత్వం అవసరమని చెబుతున్నారు. అయితే స్మార్ట్ వాచ్‌లు ఆరోగ్య సమస్యల గురించి అలర్ట్ చేసినప్పుడు వైద్యుడి వద్దకు వెళ్లి రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఈ విషయంలో ఇవి గొప్పగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు.