Jeans Wash Care: జీన్స్‌ ప్యాంట్‌ని పదే పదే ఉతకడం మంచిది కాదు.. ఎందుకంటే..?

Jeans Wash Care: జీన్స్‌ ప్యాంట్‌ అంటే యుత్‌లో యమ క్రేజ్‌ ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరు ఇష్టపడుతారు.

Update: 2022-01-10 10:08 GMT

Jeans Wash Care: జీన్స్‌ ప్యాంట్‌ని పదే పదే ఉతకడం మంచిది కాదు.. ఎందుకంటే..?

Jeans Wash Care: జీన్స్‌ ప్యాంట్‌ అంటే యుత్‌లో యమ క్రేజ్‌ ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరు వీటిని ఇష్టపడుతారు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడాలేకుండా అందరూ ధరిస్తారు. అయితే వీటి గురించి చాలామందికి తెలియని నిజం ఒకటి ఉంది. వీటని ఎక్కువగా ఉంతకకూడదు. ఇదే మీరు చేస్తున్న పెద్ద తప్పు. చాలా మంది నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

మీ కిష్టమైన జీన్స్‌ని పదే పదే ఉతకడం మంచి పద్దతి కాదంటున్నారు. ఇలా చేస్తే మీరు పెద్ద తప్పు చేస్తున్నారని అంటున్నారు. ప్రపంచంలోని మొట్టమొదటి జీన్స్ సృష్టికర్త, ప్రపంచవ్యాప్త ప్రసిద్ధ జీన్స్ కంపెనీ లెవిస్ CEO చిప్ బెర్గ్ జీన్స్ ని ఎప్పుడూ ఉతకకూడదని చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం, లేవిస్ వెబ్‌సైట్‌లో జీన్స్‌ను ఎప్పుడూ ఉతకకూడదని బ్లాగులో కూడా రాసుకొచ్చారు. అతడి ప్రకారం వాషింగ్ మెషీన్లో జీన్స్ ఉతరకడం అవసరం లేదు. అవసరమైతేనే అది చేయాలి.

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే జీన్స్ ఉతకకూడదు.. మరి ఎలా శుభ్రం చేయాలంటే దానికొక మార్గం చెప్పాడు. జీన్స్ పై పడిన ఏదేని మరకలను టూత్ బ్రష్ తో శుభ్రం చేయాలన్నాడు. జీన్స్ ని ఉతకడం వల్ల దాని పదార్థం దెబ్బతింటుందని, నీరు కూడా వృథా అవుతుందని చిప్ బెర్గ్ సూచించాడు. కొత్త జీన్స్‌ను కనీసం 6 నెలల తర్వాత మాత్రమే ఉతకాలన్నాడు. అప్పుడే అది మంచిగా కనబడుతుందని చెప్పాడు. జీన్స్ నుంచి బ్యాక్టీరియాను నివారించడానికి మాత్రం రాత్రిపూట ఫ్రిజ్‌లో పెట్టాలన్నాడు.

ఉదయం అందులో నుంచి తీసి ఎండలో ఆరేయాలని సూచించాడు. ఆ తర్వాత మళ్లీ కొన్ని రోజుల వరకు దానిని ఉతకవలసిన పనిలేదన్నాడు. జీన్స్ శుభ్రంగా లేదని మీకు అనిపిస్తే.. చల్లటి నీటితో ఉతకాలన్నాడు. జీన్స్ ను ఇతర బట్టల నుంచి విడిగా ఉతకాలన్నాడు. అంతేకాదు వాషింగ్ మెషీన్లో కాకుండా చేతితో శుభ్రం చేయాలన్నాడు. అంతేకాకుండా వాషింగ్ గురించిన సమాచారం జీన్స్ ట్యాగ్ మీద ఉంటుందని అందరు గమనించాలని సూచించాడు.

Tags:    

Similar News