Diabetes: చిన్న పిల్లల్లో విజృంభిస్తున్న మధుమేహం.. కారణం ఏంటంటే..?

Diabetes: భారతదేశంలో డయాబెటిక్ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం దేశంలో ప్రతి 10 మందిలో ఒకరికి మధుమేహం ఉంది.

Update: 2022-08-12 12:30 GMT

Diabetes: చిన్న పిల్లల్లో విజృంభిస్తున్న మధుమేహం.. కారణం ఏంటంటే..?

Diabetes: భారతదేశంలో డయాబెటిక్ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం దేశంలో ప్రతి 10 మందిలో ఒకరికి మధుమేహం ఉంది. అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య నివేదిక ప్రకారం భారతదేశంలో 77 మిలియన్లకు పైగా మధుమేహ రోగులు ఉన్నారు. ఈ సంఖ్య 2030 నాటికి 100 మిలియన్లను దాటవచ్చు. ప్రపంచంలోని మధుమేహ జనాభాలో 17% మంది భారతదేశంలో నివసిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ వ్యాధి యువతతో పాటు చిన్నారులని కూడా బాధితులుగా మారుస్తోంది.

ఈ వ్యాధితో బాధపడుతున్న మొత్తం జనాభాలో 50 శాతం మందికి వ్యాధి నిర్ధారణ కాకపోవడం ఆందోళన కలిగించే విషయం. దీనిని సకాలంలో గుర్తించకపోతే గుండెపోటుతో సహా అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దేశంలో పెరుగుతున్న మధుమేహ కేసుల్లో టైప్-2 మధుమేహం కేసులు ఎక్కువగా ఉన్నాయి. మధుమేహం వల్ల ఇతర వ్యాధులు కూడా ప్రజల్లో పెరుగుతున్నాయి.

గత కొన్నేళ్లుగా ఊబకాయం సమస్య పెరుగుతోంది. దీనివల్ల పిల్లలు, పెద్దలు అని తేడాలేకుండా మధుమేహం పెరుగుతోంది. ప్రజలు ఆటలు ఆడటం లేదు. శారీరక శ్రమ తగ్గింది. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలో గంటల తరబడి పని చేస్తున్నారు. సరైన ఆహారం తీసుకోవడం లేదు. జంక్ ఫుడ్ జీవితంలో భాగమైపోయింది. చిన్న పిల్లల్లో మధుమేహ కేసులు రావడానికి కారణం ఇదే. పిల్లల్లో సరైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల ఊబకాయం పెరుగుతోంది. దీంతో మధుమేహ బాధితులుగా మారుతున్నారు.

అందుకే పిల్లల సంరక్షణ చాలా ముఖ్యం. ఇందుకోసం చిన్నారులని ఆటలు ఆడేవిధంగా ప్రోత్సహించాలి. వారు రోజుకు కనీసం ఒక గంట శారీరక శ్రమ చేయాలి. అలాగే పిల్లలకి చక్కడి డైట్‌ మెయింటెన్ చేయాలి. డయాబెటిస్ కేసులకు కరోనా వైరస్ కూడా ఒక కారణం. కోవిడ్ సోకిన వారికి స్టెరాయిడ్స్ అందించారు. దీని వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయి గణనీయంగా పెరిగి మధుమేహం సమస్యగా మారింది. దీనివల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అనేక రకాల అంటు వ్యాధుల ప్రమాదం పెరుగుతోంది.

Tags:    

Similar News