Corn Cutlet: పిల్లల కోసం మొక్కజొన్న కట్లెట్.. ఖర్చు కూడా తక్కువే.. ఇంట్లోనే తయారు చేయండి..
Corn Cutlet: చలికాలంలో పిల్లలు సాయంత్రం వేడి వేడి స్నాక్స్ కోసం వెతుకుతుంటారు. అయితే రోజు ఇచ్చే ఆహారపదార్థాలు కాకుండా కొత్త వంటకాల రుచితో సర్ప్రైజ్ ఇవ్వండి.
Corn Cutlet: చలికాలంలో పిల్లలు సాయంత్రం వేడి వేడి స్నాక్స్ కోసం వెతుకుతుంటారు. అయితే రోజు ఇచ్చే ఆహారపదార్థాలు కాకుండా కొత్త వంటకాల రుచితో సర్ప్రైజ్ ఇవ్వండి. ఇలా చేస్తే శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా పిల్లలు యాక్టివ్‌గా ఉంటారు. అలాంటి ఒక వంటకమే మొక్కజొన్న కట్లట్. మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అద్భుత పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా అందుబాటు ధరలో దొరుకుతుంది. మొక్కజొన్న కట్లెట్‌ని ఇంట్లోనే సులువుగా ఎలా తయారుచేయవచ్చో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
1. 2 కప్పులు ఉడికించిన స్వీట్ కార్న్
2. 2 ఉడికించిన బంగాళదుంపలు
3. 1 నిమ్మకాయ
4. పసుపు పొడి
5. ఎర్ర మిరపకాయ
6. పచ్చి కొత్తిమీర
7. సన్నగా తరిగిన క్యారెట్
8. పచ్చిమిర్చి
9. 1 కప్పు తరిగిన బీన్స్
10. అల్లం-వెల్లుల్లి
11. ఉప్పు రుచి ప్రకారం
తయారు చేసే విధానం..
మొదట బంగాళదుంపలు, మొక్కజొన్నలను ఉడకబెట్టాలి. బంగాళాదుంపలు చల్లారక దానికి అన్ని పదార్థాలు సుగంధ ద్రవ్యాలను కలపాలి. ఇందులో స్వీట్ కార్న్ కూడా వేయాలి. మీకు కావాలంటే ఇందులో బ్రెడ్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కట్‌లెట్‌ను లోపలి నుంచి వేడిగా ఉంచుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కట్‌లెట్‌లుగా చేసి ఆపై పాన్‌పై వేయించాలి. కొంత సమయం తరువాత మీ కట్లెట్స్ సిద్ధంగా ఉంటాయి. దీన్ని మయోన్నైస్ లేదా రెడ్ సాస్‌తో తినాలి. వేడి వేడిగా తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది.