Mellites Breakfast: ఈ చిరుధాన్యాలలో పోషకాలు పుష్కలం.. బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఈ రోగాలకు చెక్..!
Mellites Breakfast: పూర్వకాలంలో బియ్యం, గోధుమలు తక్కువగా తినేవారు. ఎక్కువగా చిరుధాన్యాలను ఆహారం గా ఉపయోగించేవారు. అందుకే అప్పటి మనుషులు వందేళ్లు బతికారు.
Mellites Breakfast: పూర్వకాలంలో బియ్యం, గోధుమలు తక్కువగా తినేవారు. ఎక్కువగా చిరుధాన్యాలను ఆహారం గా ఉపయోగించేవారు. అందుకే అప్పటి మనుషులు వందేళ్లు బతికారు. కానీ నేటి ఆధునిక రోజుల్లో మనిషి 60 ఏళ్లు బతకడం గగనంగా మారింది. దీనికి కారణం జీవన విధానం, ఆహార పద్దతులలో మార్పు రావడమే. పూర్వకాలంలో చిరుధాన్యాలను ఎక్కువగా పండించేవారు కానీ నేటి కాలంలో ఆదాయం కోసం వాణిజ్య పంటలను ఎక్కువగా పండిస్తున్నారు. వరి, గోధుమ పంటలకు పురుగు మందులు ఎక్కువగా వాడుతున్నారు. వీటిని తినడం వల్ల రకరకాల వ్యాధులకు గురవుతున్నారు. అందుకే మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు ఉదయం చిరుధాన్యాలతో తయారుచేసిన అల్పాహారం తినడం అవసరం. ఈ రోజు వీటి గురించి తెలుసుకుందాం.
కొర్రలు : ఇవి రెండు రకాల రుచిని కలిగి ఉంటాయి. ఇవి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి తీపి, వగరు రుచులను కలిగి ఉండటం వల్ల వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిలో అధిక పీచు, మాంసకృత్తులు , ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. మూత్రంలో మంట, కడుపు నొప్పి, అతిసారం, ఆకలి లేకపోవడం మొదలైన సమస్యలకు మంచి ఔషధంగా పని చేస్తాయి.
ఊదలు: ఇవి తినడం వల్ల ఉద్యోగులకు చాలా మేలు జరుగుతుంది. ఇవి శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతాయి. ఉద్యోగులు ఎక్కువసేపు కూర్చుని పని చేస్తారు. శారీరక శ్రమ లేని వారికి ఊదలు మంచి ఆహారం. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మలబద్ధకం, మధు మేహానికి మంచిగా పనిచేస్తాయి.
అరికెలు: వీటిలో విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. కాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా అరికెలు నివారిస్తాయని న్యూట్రిషన్లు చెబుతున్నారు. రక్తంలో కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
సామలు: వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అతిసారం, అజీర్ణం, సుఖ వ్యాధులు, శుక్రకణాల వృద్ధికి, ఆడవారిలో రుతు సమస్యలకు మంచి ఔషధంగా పని చేస్తాయి. ముఖ్యంగా మైగ్రేన్ సమస్య ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తాయి. కీళ్ల నొప్పులు, ఊబకాయం, గుండె జబ్బుల నివారణకు మంచి ఆహారం.