Health Tips: రెడ్ వెల్వెట్ కేక్ చూడగానే నోరు ఊరుతోందా.? అయితే తస్మాత్ జాగ్రత్త.. క్యాన్సర్ వచ్చే అవకాశం

Health Tips: రెడ్ వెల్వెట్ కేక్ తినడానికి ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. పుట్టిన రోజు, పెళ్లిరోజు అన్ని రకాల శుభ సందర్భాలలో కేక్‌లను కట్ చేస్తారు. పిల్లల నుంచి పెద్దల వరకూ వివిధ రుచుల కేకులను తినడానికి ఇష్టపడతారు.

Update: 2024-10-14 05:30 GMT

Health Tips: రెడ్ వెల్వెట్ కేక్ చూడగానే నోరు ఊరుతోందా.? అయితే తస్మాత్ జాగ్రత్త.. క్యాన్సర్ వచ్చే అవకాశం


Health Tips: రెడ్ వెల్వెట్ కేక్ తినడానికి ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. పుట్టిన రోజు, పెళ్లిరోజు అన్ని రకాల శుభ సందర్భాలలో కేక్‌లను కట్ చేస్తారు. పిల్లల నుంచి పెద్దల వరకూ వివిధ రుచుల కేకులను తినడానికి ఇష్టపడతారు. ఇందులో రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ ఫ్లేవర్ ఉన్న చాలా మందికి ఇష్టమైన రుచులు. అయితే తాజాగా వీరికి సంబంధించిన ఓ షాకింగ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. రెడ్ వెల్వెట్ వంటి 12 రకాల కేకుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తేలిందని నివేదిక వెల్లడించింది. ఇటీవల కర్ణాటకలోని బెంగళూరులోని వివిధ బేకరీలలో విక్రయించే వివిధ రకాల కేక్‌ల నమూనాలను పరీక్షించారు. కొన్ని కేకుల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే హానికరమైన పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నివేదిక గురించి వివరంగా తెలుసుకుందాం-

నివేదిక ఏం చెబుతోంది?

నివేదికల ప్రకారం, పరీక్షించిన కొన్ని కేక్ నమూనాలలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని కనుగొన్నారు, ఇది క్యాన్సర్‌కు కారణం కావచ్చని తేల్చారు. అసురక్షిత రసాయనాలు, పదార్థాలను వాడవద్దని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బేకరీలను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ శ్రీనివాస్ కే హెచ్చరించారు. పరీక్షించిన 235 కేక్ శాంపిల్స్‌లో 12లో అల్లూరా రెడ్, సన్‌సెట్ ఎల్లో FCF, Ponceau 4R, Tartarazine Carmoisin వంటి కృత్రిమ రంగులు కనుగొన్నారు. ఇవి నిర్దేశించిన భద్రతా పరిమితుల కంటే ఎక్కువగా ఉపయోగించినట్లు కనుగొన్నారు.

కలర్‌ఫుల్‌గా కనిపించే కేక్‌లలో క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ వంటి కేక్‌లతో సహా, కేక్‌లలో ఉపయోగించే కృత్రిమ రంగులు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని పేర్కొన్నారు.

కృత్రిమ రంగులు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి:

కొన్ని కృత్రిమ రంగులు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని పరిశోధనలో తేలింది. ఇందులో ఎరుపు 40, పసుపు 5 పసుపు 6 వంటి రంగులు బెంజిడిన్, 4-అమినోబిఫెనిల్ 4-అమినోఅజోబెంజీన్ వంటి క్యాన్సర్ కారకాలను కలిగి ఉండవచ్చని తేల్చారు. వివిధ పరిశోధన అధ్యయనాలలో క్యాన్సర్‌కు కారణమవుతుందని తేలింది.

వైద్యులు ప్రకారం, కొన్ని ఆహార పదార్థాల్లో పెద్ద మొత్తంలో కృత్రిమ రంగులు ఉన్నట్లు గుర్తించారు. ఇవి ముఖ్యంగా కడుపు క్యాన్సర్‌తో సంబంధం కలిగి ఉంటాయి. "కొన్ని కృత్రిమ రంగులు విషపూరితమైనవి క్యాన్సర్ కారకమైనవి, ఇవి ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి. కేకులే కాదు, కృత్రిమ రంగులు వాడే ఇతర ఆహార పదార్థాల వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే బెంగుళూరులో రోడమైన్-బి వంటి కృత్రిమ రంగులను ఉపయోగించడం వల్ల పీచు మిఠాయి, గోబీ మంచూరియా వంటి స్ట్రీట్ ఫుడ్ కూడా కొంతకాలం క్రితం నిషేధించారు.

Tags:    

Similar News