Weight Loss: ఈ పండ్లతో త్వరగా బరువు తగ్గొచ్చు.. కొవ్వు ఐస్‌లా కరిగిపోవడం పక్కా తెలుసా?
Weight Loss Fruits: వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవాళ్లు డైట్ పాటిస్తారు. అయితే వాళ్ల ఆహార జాబితాలో పండ్లు చేర్చుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. అవి ఏంటో తెలుసుకుందాం.

Weight Loss: ఈ పండ్లతో త్వరగా బరువు తగ్గొచ్చు.. కొవ్వు ఐస్‌లా కరిగిపోవడం పక్కా తెలుసా?
Weight Loss Fruits: బరువు తగ్గాలనుకునే వారు ఫైబర్, ఖనిజాల, విటమిన్స్ ఉండే ఆహారాలు తీసుకోవాలి. అంతే కాదు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. అలాంటి కొన్ని ఆహారాలు ఉన్నాయి. అయితే, కూరగాయలు మాత్రమే కాదు కొన్ని పండ్లు మనం తీసుకుంటూ కూడా బరువు ఈజీగా తగ్గవచ్చు. అవి ఏంటో తెలుసుకుందాం
యాపిల్ తీసుకోవడం వల్ల ఇందులో ఫైబర్ అధిక మోతాదులో ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఆపిల్ నేరుగా లేదా సలాడ్ చేసుకుని తీసుకోవచ్చు. జ్యూస్ రూపంలో కూడా తాగవచ్చు. యాపిల్‌లో పాలీఫెనల్స్ ఉంటాయి. ఇది ఒబేసిటీని తగ్గిస్తుంది. నేచురల్ చెక్కరలు ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
బెర్రీ జాతికి చెందిన పనులు డైట్లో చేర్చుకోవడం వల్ల కూడా మంచిది. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీలు తీసుకోవాలి. దీంతో బరువు పెరగకుండా ఉంటారు. ఇందులో బయో యాక్టివ్ కాంపౌండ్ ఉంటాయి.
ఇవి కాకుండా అరటి పండులో విటమిన్స్, పొటాషియం ,మెగ్నీషియం మ్యాంగనీస్ ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. రక్తంలో చక్కరలను నిర్వహిస్తుంది.
ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. అరటిపండ్లు తింటూ బరువు తగ్గొచ్చు.
ఇవి కాకుండా కొన్ని మిలాన్ జాతికి చెందిన పండ్లు తీసుకోవడం వల్ల అందులో నీరు అధికంగా ఉంటుంది. వీటితో బరువు తగ్గుతారు. మన రోజంతటికి కావలసిన హైడ్రేషన్ అందిస్తుంది. క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
ఇంకా జామ పండు తీసుకోవడం వల్ల డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇమ్యూనిటీని బలపరుస్తుంది. మెటబాలిజం రేటును పెంచుతుంది. ఇందులో గ్లైసెమిక్ సూచీ (GI) కూడా తక్కువ కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. జామపండును డైట్ లో చేర్చుకుంటూ బరువు తగ్గొచ్చు. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు ఇలాంటి ఫుడ్స్ తింటూ సరైన ఎక్సర్‌సైజ్ చేయాలి. ఏవైనా సలహాలకు వైద్యులను సంప్రదించాలి. అతిగా నీరు తీసుకుంటూ కూడా బరువు తగ్గవచ్చు.