Asthma Risk: మారుతున్న సీజన్‌లో ఉబ్బసం వచ్చే ప్రమాదం ఎక్కువ.. ప్రారంభ లక్షణాలని గుర్తించండి..!

Asthma Risk: మారుతున్న సీజన్‌లో ఆస్తమా రోగులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు సకాలంలో గుర్తిస్తే ఆస్తమా అటాక్‌ను నివారించవచ్చు. దీని ప్రారంభ లక్షణాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

Update: 2023-06-06 16:00 GMT

Asthma Risk: మారుతున్న సీజన్‌లో ఉబ్బసం వచ్చే ప్రమాదం ఎక్కువ.. ప్రారంభ లక్షణాలని గుర్తించండి..!

Asthma Risk: మే నెల ముగిసి జూన్‌ ప్రారంభమైంది. దీంతో వాతావరణం రోజురోజుకి మారుతోంది. కొన్నిసార్లు ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. మరి కొన్నిసార్లు ఉరుములతో కూడిన వర్షపు జల్లులు పడుతున్నాయి. ఇలా నిరంతరం వాతావరణంలో మార్పు రావడం వల్ల శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయి. ముఖ్యంగా ఆస్తమా అటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఉబ్బసం వ్యాధిలో రోగి శ్వాసకోశంలో వాపు ఏర్పడుతుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. మారుతున్న సీజన్‌లో ఆస్తమా రోగులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు సకాలంలో గుర్తిస్తే ఆస్తమా అటాక్‌ను నివారించవచ్చు. దీని ప్రారంభ లక్షణాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

దగ్గు

మారుతున్న వాతావరణం వల్ల ఆస్తమా రోగుల సమస్యలు మరింత పెరుగుతాయి. దీనివల్ల ఇతర వ్యక్తులు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. తరచుగా దగ్గుతో బాధపడుతుంటే, నిద్రపోతున్నప్పుడు సమస్య తీవ్రమవుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇవి ఆస్తమా లక్షణాలు అవుతాయి. పిల్లలు ఈ సమస్యను ఎదుర్కొంటే వెంటనే చికిత్స తీసుకోవాలి.

అలసిపోతారు

ఛాతీ నొప్పితో పాటు అలసట ఉండి, దగ్గుతో బాధపడుతుంటే చాలా ప్రమాదంగా గుర్తించాలి. ఈ లక్షణాలను అస్సలు విస్మరించకూడదు. ఈ పరిస్థితిలో చాలా మంది మెడికల్ స్టోర్‌కి వెళ్లి స్వయంగా మందులు లేదా సిరప్ తీసుకుంటారు. కానీ ఇలా చేయడం మంచిదికాదు. ఈ లక్షణాలు ఇలాగే కొనసాగితే వైద్యుడికి చూపించాలి. వారు X- రే లేదా ఛాతీ CT స్కాన్ సహాయంతో వ్యాధిని నిర్ధారిస్తారు. సరైన మందులు రాస్తారు.

ఛాతి నొప్పి

ఆస్తమా విషయంలో తీవ్రమైన ఛాతీ నొప్పి ఉంటుంది. ముఖ్యంగా దగ్గుతున్నప్పుడు ఛాతీ నొప్పి తీవ్రంగా ఉంటుంది. చాలా మంది దీనిని గ్యాస్ పెయిన్‌గా భావిస్తారు. కానీ ఎప్పుడు ఇలా చేయకూడదు. ఈ పరిస్థితిలో మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Tags:    

Similar News