Clove: భోజనం చేసిన తర్వాత లవంగం తింటే.. ఎన్ని లాభాలో తెలుసా.?
Clove: వంటింట్లో కచ్చితంగా ఉండే ఆహార పదార్థాల్లో లవంగం ఒకటి. దాదాపు అన్ని వంటకాల్లో లవంగాలను ఉపయోగిస్తుంటాం.

Clove: భోజనం చేసిన తర్వాత లవంగం తింటే.. ఎన్ని లాభాలో తెలుసా.?
Clove: వంటింట్లో కచ్చితంగా ఉండే ఆహార పదార్థాల్లో లవంగం ఒకటి. దాదాపు అన్ని వంటకాల్లో లవంగాలను ఉపయోగిస్తుంటాం. అయితే లవంగం కేవలం వంటకు రుచిని మాత్రమే కాకుండా శరీరానికి ఆరోగ్యాన్ని సైతం అందిస్తుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే రోజూ లవంగంను తీసుకోవాలని సూచిస్తుంటారు. లవంగంలో ఉన్న ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ప్రతీ రోజూ భోజనం చేసిన వెంటనే రెండు లవంగాలను నోట్లో వేసుకుంటే పలు సమస్యలు దూరమవుతాయి. వీటిలో ప్రధానమైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం చేసిన వెంటనే లవంగాలను నోటిలో వేసుకుంటే నోటి దుర్వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది. 2014లో నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన పరిశోధన ప్రకారం, లవంగాలలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.
ఇందులో ఉండే యూజెనాల్ అనే మూలకం జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, దుర్వాసనను తగ్గిస్తుంది. లవంగాలు గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి జీర్ణ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడంలో సహకరిస్తాయి, తద్వారా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి నోటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. పంటి నొప్పి, చిగుళ్ల వాపు వంటి దంత సమస్యల నుంచి ఉపశమనం ఇస్తాయి.
గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలకు లవంగాలు సహజ ఔషధంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఇవి కఫాన్ని తొలగించడంలో సహకరిస్తాయి. రక్తంలో చక్కెర మోతాదును నియంత్రించడంలో కూడా ఇవి ఉపకరిస్తాయి. లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో రోగనిరోధక శక్తి బలపడుతుంది. నిపుణుల సూచన ప్రకారం, భోజనం తర్వాత 1–2 లవంగాలను నెమ్మదిగా నమలడం మంచిది.
నోట్: ఈ వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.