Ayurveda Tips: ఆయుర్వేదం ప్రకారం పాలు, నీళ్లని ఈ విధంగా తీసుకోవాలి.. లేదంటే చాలా అనర్థాలు..!
Ayurveda Tips: తినడం, తాగడం గురించి ఆయుర్వేదంలో వివిరంగా చెప్పారు.
Ayurveda Tips: తినడం, తాగడం గురించి ఆయుర్వేదంలో వివిరంగా చెప్పారు. వీటిని అనుసరిస్తే శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. కొంతమందికి పాలు తాగిన తర్వాత కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. మరికొందరికి కడుపు ఉబ్బినట్లు అనిపిస్తుంది. దీనికి అసలు కారణం పాలని తప్పుగా తాగడం. పాలు ఎప్పుడూ నిల్చొని తాగాలని, కూర్చొని నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటి గురించి తెలుసుకుందాం.
కూర్చుని నీళ్లు తాగాలి
కూర్చొని నీటిని తాగడం వల్ల ప్రమాదకరమైన రసాయనాలు రక్తంలో కలిసిపోకుండా ఉంటుంది. దీనివల్ల రక్తం శుద్ధి అవుతుంది. అందుకే కూర్చున్నప్పుడే నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీంతోపాటు ఆహారం తిన్న వెంటనే నీరు తాగకూడదు. ఒకేసారి ఎక్కువ నీరు కూడా తాగకూడదు. నీటిని ఎప్పుడైనా కొద్ది కొద్దిగా తాగాలి.
నిలబడి పాలు తాగాలి
పాలు తాగిన తర్వాత జీర్ణక్రియ దెబ్బతినడం కొందరిలో కనిపిస్తుంది. చాలామందికి కడుపులో గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పాలు నిల్చుని తాగాలి. పాలను ఎల్లప్పుడూ వేడి చేసి, ఆహారం తీసుకున్న 2 గంటల తర్వాత త్రాగాలి. ఇది మీ మోకాళ్లను స్థిరంగా ఉంచుతుంది. ఇది కండరాలకు మరింత ప్రయోజనం చేకూరుస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు సరిగ్గా ఉంటుంది.