WHO: బద్ధకస్తులుగా భారతీయులు..శారీరక శ్రమకు దూరమవుతూ..జబ్బులకు దగ్గరవుతున్న జనం

WHO: భారతీయుల జీవనశైలి మారింది. ఆధునీక జీవన శైలి కారణంగా శారీరక శ్రమకు దూరం అవుతున్నారు. ఫలితంగా జబ్బుల ముప్పును కొనితెచ్చుకుంటున్నారని ఓ అధ్యయనంలో తేలింది.

Update: 2024-06-27 07:08 GMT

WHO: బద్ధకస్తులుగా భారతీయులు..శారీరక శ్రమకు దూరమవుతూ..జబ్బులకు దగ్గరవుతున్న జనం

WHO: భారతీయులు ఆధునిక జీవనశైలికి అలవాటు పడుతున్నారు. దీంతో శారీరక శ్రమకు దూరమవుతున్నారు. ఫలితంగా జబ్బులు ముప్పును కొని తెచ్చుకుంటున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. సగానికిపైగా భారతీయులు ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు తగ్గట్లుగా శారీరక శ్రమ చేయడంలేదని అధ్యయనం గుర్తించింది. దీనికి సంబంధించిన వివరాలను లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.

ఈ జర్నల్ ప్రకారం పురుషులతో పోల్చితే ఎక్కువ మంది మహిళలు తగినంత శారీరక శ్రమ చేయడంలేదని తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలకు తగ్గట్లుగా శారీరక శ్రమ లేని వారిలో భారత్ కు చెందిన మహిళలు 57శాతం ఉంటే పురుషులు 42శాతం ఉన్నారు. శారీరక శ్రమకు దూరమవుతూ జబ్బులకు దగ్గరవుతున్న భారతీయుల సంఖ్య ప్రతిఏటా భారీ పెరిగిపోతోంది. 2000లో తగినంత శారీరక శ్రమలేని భారతీయులు 22.3 శాతం ఉండగా..2022 నాటికి ఇది 49.4 శాతానికి పడిపోవడం ఆందోళనకర విషయం.

ఇవి WHO మార్గదర్శకాలు:

ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత శారీరక శ్రమ అవసరమో డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. వీటి ప్రకారం..పెద్దలు వారానికి 150 నుంచి 300 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం, డ్యాన్స్ చేయడం, వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు మధ్యస్థంగా చేయాలి. లేదంటే 75నిమిషాల పాటు తీవ్రత ఎక్కువగా ఉండే విధంగా శారీరక శ్రమ చేయాలి.

వారానికి 150 నిమిషాల కంటే తక్కువ శారీరక శ్రమ చేసేవారిని లేదా 75నిమిషాల కంటే తక్కువ తీవ్రమైన శారీరక శ్రమ చేసేవారిని శారీరకంగా చురుగ్గా లేనివారిగా పరిగణిస్తారు. ఇలాంటి వారికి గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, డెమెన్షియా, బ్రెస్ట్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్ వంటి జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుంది.



 

Tags:    

Similar News