రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి సోదరభావంతో ముందుకు సాగడం నిజంగా అభినందనీయమని అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు... రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోదరభావంతో మెలగడం వల్ల రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు జరుగుతుందని, ఇది స్వాగతించాల్సిన అంశమేనని చెప్పారు. ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడిన అయన ఈ వాఖ్యలు చేసారు ..
ఐదేళ్ల నుంచి ఎటూ తేలని వివాదాల విషయంలో పరస్పర చర్చల ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నించటం అభినందించాల్సిన అంశమన్నారు. కేంద్రం జోక్యం అవసరం లేకుండా పరిష్కారం చేసుకోగలిగితే ఇంకా మచిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రయత్నం సఫలం కావాలని తాను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానన్నారు. గడచిన ఐదేళ్లలోనూ తాను ఇదే కోరుకున్నానని కాని అనుకోని కారణా వల్ల ఇది సాధ్యంకాకపోవడం నిరాశ కలిగించిందన్నారు. అభివృద్ధికోసం రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని ఆశిస్తున్నట్లు వెంకయ్యనాయడు తెలిపారు.