Viral Video: ఇలాంటి శునకం ఒక్కటి ఉంటే చాలు.. ఫుల్ టైంపాస్.. వైరల్ అవుతోన్న వీడియో..!
Viral Video: మనుషులకు శునకాలు మంచి స్నేహితులని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే శునకాలను పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.
Viral Video: మనుషులకు శునకాలు మంచి స్నేహితులని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే శునకాలను పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. విశ్వాసానికి పెట్టింది పేరైన కుక్క చాలా మంది ఇళ్లలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటాయి. ఇక శునకాలు కేవలం ఇంటికి రక్షణ కల్పించేవి మాత్రమే కాదు. మనుషులకు తోడుగా నిలుస్తాయి. భావోద్వేగంగా కూడా మనుషులతో కుక్కలు కనెక్ట్ అయ్యే సందర్భాలు ఎన్నో చూశాము.
అందుకే ఒంటరిగా జీవించే వారు శునకాలను పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే. మనుషులకు, కుక్కలకు మధ్య సంబంధం ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో చెబుతోంది. ఇలాంటి ఒక శునకం తోడుగా ఉంటే చాలు అసలు బోర్ అనేది కొట్టదని ఈ వీడియో చూసిన నెటిజన్లు అంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌లోని ఓ బీచ్‌లో వ్యక్తి సరదాగా గడిపేందుకు వచ్చాడు. వెంటా అతని శునకాన్ని కూడా తీసుకొచ్చుకున్నాడు. అయితే అదే సమయంలో చేతిలో ఫుట్ బాల్‌తో ఆడుతున్నాడు. ఆ వ్యక్తి బాల్ వేసినా కొద్దీ శునకం తలతో మళ్లీ అదే వేగంతో బంతిని ఆ వ్యక్తికి నెడుతోంది. అచ్చంగా ఇద్దరు వ్యక్తులు ఆడితే ఎలా ఉంటుందో అలాగే ఉందా వీడియో.
దీనంతటినీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నిజంగా కుక్క భలే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇలాంటి శునకం తోడుగా ఉంటే అసలు లైఫ్‌లో బోర్ అనేదే రాదంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంమీద ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.