Viral Video: మీరు ఎప్పుడైనా లైవ్‌లో యాక్సిడెంట్ చూశారా.? షాకింగ్‌ వీడియో..!

Viral Video: దేశవ్యాప్తంగా నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒక చోటు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

Update: 2024-12-23 07:03 GMT

Viral Video: మీరు ఎప్పుడైనా లైవ్‌లో యాక్సిడెంట్ చూశారా.? షాకింగ్‌ వీడియో..!

Viral Video: దేశవ్యాప్తంగా నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒక చోటు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని రకాల జాగ్రత్తలు చెప్పినా రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. ఇక దాదాపు మెజారిటీ రోడ్డు ప్రమాదాలకు అతి వేగమే కారణమని జరిగిన సంఘటనలు చెబుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

అతి వేగం ఎంత ప్రమాదకరమే చెప్పేందుకు ఈ వీడియోనే సాక్ష్యంగా చెప్పొచ్చు. వివరాల్లోకి వెళితే రాజస్థాన్‌లోని నాగౌర్‌ నుంచి బికనీర్‌కు ఓ కారు వాయు వేగంతో దూసుకెళ్తోంది. అదే సమయంలో అదుపు తప్పిన కారు ఒక్కసారిగా బోల్తా కొట్టింది. అచ్చంగా సినిమాల్లో చూపించిన విధంగా కారు గింగిరాలు కొడుతూ రోడ్డు పక్కన ఉన్న ఓ గేటుకు బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో వాహనంలో మంటలు కూడా వచ్చినట్లు స్పష్టమవుతోంది.

ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అవుతోంది. అయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగినా అందులో ఉన్న ప్రయాణికులకు మాత్రం ఎలాంటి గాయం కాకపోవడం గమనార్హం. కారు అంతలా పల్టీలు కొట్టిన తర్వాత కూడా డ్రైవర్‌ నిక్షేపంగా బయటకు వచ్చినట్లు వీడియోలో స్పష్టమవుతోంది. కారులో నుంచి బయటకు వచ్చిన డ్రైవర్‌ నేరుగా వెళ్లి టీ తాగడం విశేషం.

అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నిజంగా అదృష్టం అంటే వీళ్లదే, ఇంత ప్రమాదం జరిగినా సేఫ్‌గా బయటపడ్డారు అని కామెంట్స్‌ చేస్తున్నారు. 


Tags:    

Similar News