Viral Video: అటు కప్ప ఇటు పిల్లి.. ఈ పాము కష్టం ఎవరికీ రాకూడదు.. వైరల్ వీడియో..!
Viral Video: 'ఒక జీవికి ఆకలి వేసిందా.. ఇంకో జీవికి ఆయువు మూడినట్లే' ఇది పుష్ప సినిమాలోని పాటలో ఉండే చరణం.
Viral Video: 'ఒక జీవికి ఆకలి వేసిందా.. ఇంకో జీవికి ఆయువు మూడినట్లే' ఇది పుష్ప సినిమాలోని పాటలో ఉండే చరణం. నిజంగా కూడా సృష్టి ధర్మం ఇలాగే నడుస్తోంది. మనుషులు జంతువులను యథేశ్చగా చంపేస్తుంటారు. కానీ జంతువుల మధ్య జరిగే వైరాలు మాత్రం ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు జీవుల మధ్య ఆహారం కోసం నిత్యం పోరు జరుగుతూనే ఉంటుంది.
అయితే 'విడమంటే కప్పకు కోపం వద్దంటే పాముకు కోపం' అనే సామెత గురించి మనం వినే ఉంటాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే ఈ సామెతకు సరిగ్గా సెట్ అవుతోంది. పాము, కప్ప, పిల్లి మధ్య సాగిన ఈ సమరానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
పెద్ద సైజ్‌లో ఉన్న ఓ కప్ప ఒక పామును సగం వరకు మింగేసింది. దీంతో ఆ పాము ఏం చేయలేక అటు ఇటు కదులుతుంది. అయితే అంతలోనే మరోవైపు నుంచి పిల్లి వచ్చి. పాముపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో చావు చివరి క్షణంలో ఉన్న పాము పిల్లిని బుసలు కొడుతూ భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. దీనంతటినీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. క్షణాల్లో వీడియో చక్కర్లు కొడుతోంది. పాము పరిస్థితి చూసిన కొందరు నెటిజన్లు అయ్యో పాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే ఈ పాముకు వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు కదూ!