Optical Illusion: అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి కదూ! తేడాగా ఉన్న ఒక్క ఫొటోను కనిపెట్టండి
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోల్లో మన ఆలోచన శక్తిని పరీక్షించేవి కొన్ని అయితే.. కంటి తీరును పరీక్షించేవి మరికొన్ని ఉంటాయి.
Optical Illusion: సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉండే వాటిలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు ఒకటి. ఇటీవల ఇది మరింత ఎక్కువైంది. ప్రతీనిత్యం ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు తెగ ట్రెండ్ అవుతుంటాయి. చిన్నారులు మొదలు పెద్దల వరకు ఇలాంటి వాటికి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. అందుకే సోషల్ మీడియా వేదికగా కొందరు ప్రత్యేకంగా పేజీలను క్రియేట్ చేసి మరీ ఇలాంటి ఫొటోలను వైరల్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెట్టింట వైరల్ అవుతోంది.
ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోల్లో మన ఆలోచన శక్తిని పరీక్షించేవి కొన్ని అయితే.. కంటి తీరును పరీక్షించేవి మరికొన్ని ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఫొటో కంటి చూపును పరీక్షించే జాబితా కిందికి వస్తుంది. పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది. ఏముంది స్పైడర్ మ్యాన్ కార్టూన్ బొమ్మలు వరుసగా ఉన్నాయి కదూ! అయితే చూడ్డానికి అన్ని బొమ్మలు ఒకేలా కనిపిస్తున్నాయి కదూ! అయితే ఇందులో ఒక ఫొటో విభిన్నంగా ఉంది. దానిని గుర్తుపట్టడమే ఈ ఫొటో పజిల్ ముఖ్య ఉద్దేశం. ఇంతకీ ఫొటో పజిల్‌ను సాల్వ్ చేశారా.?
వెరైటీగా ఉన్న ఆ స్పైడర్ మ్యాన్‌ను గుర్తించారా.? ఎంత ప్రయత్నించినా సమాధానం లభించడం లేదా.? అయితే ఓసారి జాగ్రత్తగా అన్ని స్పైడర్ మ్యాన్ ధరించిన డ్రస్‌లను గమనించండి. అందులోనే సమాధానం ఉంది. అయితే ఈ పజిల్‌ను కేవలం 10 సెకండల్లో కనిపెట్టగలిగితే మీ ఐ పవర్ సూపర్ అని అర్థం. ఎన్ని రకాల క్లూస్ ఇచ్చినా మీరు ఈ పజిల్‌ను సాల్వ్ చేయలేకపోతున్నారా.? అయితే ఓసారి రెండో లైన్‌లో రెండో ఫొటోను గమనించండి. తేడా కనిపించిందా.? అవును అన్ని బొమ్మలపై ఉన్న స్పైడర్ ఈ బొమ్మలో మాత్రం లేదు. అదే ఆ తేడా. భలే ఉంది కదూ! ఫొటో పజిల్. మరెందుకు ఆలస్యం ఈ ఫొటోను మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి పజిల్ సాల్వ్ చేయగలరేమో ట్రై చేయండి.