Eagle flying with lion video goes viral: సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎప్పడు ఎలాంటి వీడియో వైరల్ అవుతుందో తెలియని పరిస్థితి ఉంది. రోజుకో వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అయితే నెట్టింట వైరల్ అయ్యే వీడియోలు అన్ని నిజమైనవేనా అంటే కచ్చితంగా అవునని సమాధానం చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న సరికొత్త టెక్నాలజీతో లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు క్రియేట్ చేస్తున్నారు. చూసే కళ్లను సైతం మాయ చేస్తున్నారు.
కొందరు కంటెంట్ క్రియేటర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేక్ వంటి టెక్నాలజీతో (AI videos) వీడియోలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే కొందరు సినీ తారలకు సంబంధించిన ఇలాంటి వీడియోలు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. చివరికి ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇలాంటి వీడియోలపై స్పందించిన సందర్భాలు చూశాం. ఇప్పుడు ఇదంతా ఎందుకనేగా మీ సందేహం. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో కూడా ఇదే జాబితాలోకి వస్తుంది.
సాధారణంగా ఒక డేగ పామును లేదా చిన్న చిన్న పక్షులను మహా అయితే పిల్లులు లాంటి వాటిని ఎత్తుకెళ్తుందని తెలిసిందే. మరి డేగ సింహాన్ని ఎత్తుకుని పోతే ఎలా ఉంటుంది? ఊహించుకోవడం కూడా కష్టం కదూ! అయితే టెక్నాలజీతో అది సాధ్యమే అని నిరూపించారు. డేగ ఏకంగా సింహంను తన కాలితో పట్టేసుకుని ఆకాశంలోకి ఎగురుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. సముద్రపు ఒడ్డున డేగ తన కాళ్లతో సింహాన్ని కరుచుకుని వెళ్తున్నట్లు వీడియోలో ఉంది.
ఇది ఎవరో కంటెంట్ క్రియేటర్స్ తమ గ్రాఫిక్ మాయాజాలంతోనో లేక ఆర్టిఫిషియల్ టెక్నాలజీ సాయంతోనో చేసిన వీడియో అని ఆ వీడియో చూస్తేనే అర్థమవుతోంది. ఎందుకంటే అంత బరువైన సింహాన్ని డేగ ఎత్తుకెళ్లడం అసాధ్యం అనే పాయింట్ ఒకటైతే.. సాధారణంగా సింహాం కంటే డేగలు పెద్ద సైజ్‌లో ఉండవు అనేది రెండో పాయింట్. కానీ ఇక్కడ ఆ డేగ కాళ్ల కింద సింహమే చిన్నగా కనిపిస్తోంది. అన్నింటికి మించి సింహం శక్తి (Lion Power) ముందు డేగ ఏ మాత్రం సరిపోదు.
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారు కూడా ఇది కచ్చితంగా ఫేక్ వీడియో (Fake video of Hawk flying with lion in sea coast) అని కొట్టి పారేస్తున్నారు. ఇది కచ్చితంగా క్రియేటెడ్ వీడియో అంటున్నారు. డేగ సింహాన్ని ఎత్తుకెళ్లడం అసాధ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంత బరువుండే సింహాన్ని డేగ ఎలా మోస్తుందంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడీ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.