Viral Video: చీర కట్టులో అందంగా కనిపిస్తోంది కదూ! ఈమె చేసిన పని చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

Viral Video: చీర కట్టులో అందంగా కనిపిస్తోంది కదూ! ఈమె చేసిన పని చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

Update: 2024-12-22 13:45 GMT

Woman catches snake video goes viral in social media: బ్యూటీ విత్ బ్రెయిన్‌ అనే కొటేషన్‌ గురించి మనకు తెలిసిందే. అయితే బ్యూటీ విత్ డేర్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? సాధారణంగా పురుషులతో పోల్చితే మహిళలు కాస్త భయస్తులు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. నిజానికి ఈ అభిప్రాయం నిజం కాదని చాలా మంది మహిళలు ఇప్పటికే చేసి చూపించారు. అవకాయ తయారీ నుంచి అంతరిక్షం వరకు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపించిన మహిళలు ఎంతో మంది ఉన్నారు.

తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియోను చూస్తే. 'బ్యూటీ విత్ డేర్‌' అనే కొటేషన్‌కు అచ్చంగా సరిపోయేలా ఉంది. వివరాల్లోకి వెళితే.. సాధారణంగా ఇళ్లలోకి చొరబడ్డ పాములను పట్టుకునే స్నేక్‌ క్యాచర్స్‌లో పురుషులే ఎక్కువగా కనిపిస్తుంటారు. మహిళలలు ఇలాంటి రంగంలో చాలా తక్కువేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఓ మహిళ మాత్రం స్నేక్ క్యాచర్‌గా అవలీలగా పామును పట్టేసి అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలోకి పెద్ద నాగు పాము వచ్చింది. దీంతో అక్కడి స్థానికులు స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం ఇచ్చారు.

చీర కట్టులో చూడ్డానికి ఎంతో అందంగా ఉన్న మహిళ వచ్చి రాగానే జుట్టును పైకి కట్టింది. వెంటనే పామును పట్టుకునే కర్రను తీసుకొని చెక్కల మాటున దాగి ఉన్న పామును అవలీలగా బయటకు తీసింది. ఆ పామును ఓ బాటిల్‌లోకి తీసుకుని జనావాసాలకు దూరంగా వదిలి పెట్టి వచ్చేసింది. ఇదంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాక్‌కి గురవుతున్నారు. ఆ మహిళ ధైర్యానికి హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు. 'బ్యూటీ విత్‌ డేర్‌' అంటే ఇదేనంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News