Actress: ఒకప్పటి అందాల తార, ఇప్పుడు రీఎంట్రీతో సందడి చేస్తున్న బ్యూటీ.. ఎవరో గుర్తు పట్టారా?

Actress: ఒకప్పుడు వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన అందాల తారలు ఆ తర్వాత తెరమరుగయ్యారు. ఒకవేళ రీ ఎంట్రీ ఇచ్చినా కేవలం సైడ్‌ క్యారెక్టర్లకు పరిమితం అవుతారు.

Update: 2024-12-24 11:38 GMT

Actress: ఒకప్పటి అందాల తార, ఇప్పుడు రీఎంట్రీతో సందడి చేస్తున్న బ్యూటీ.. ఎవరో గుర్తు పట్టారా?

Actress: ఒకప్పుడు వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన అందాల తారలు ఆ తర్వాత తెరమరుగయ్యారు. ఒకవేళ రీ ఎంట్రీ ఇచ్చినా కేవలం సైడ్‌ క్యారెక్టర్లకు పరిమితం అవుతారు. కానీ ఓ బ్యూటీ మాత్రం చాలా కాలం గ్యాప్‌ తర్వాత కూడా మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో దూసుకొచ్చింది. సుమారు 23 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. మధ్యలో గ్యాప్‌ తీసుకొని ఇప్పుడు మళ్లీ కుర్రాళ్లు హృదయాలను కొల్లగొడుతోంది. పైన ఫొటోలో క్యాప్‌ పెట్టుకుని ఉన్న ఈ చిన్నదే ఆ హీరోయిన్‌ ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.?

మలయాళ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైన ఈ చిన్నది 2004లో వచ్చిన 'అమ్మాయి బాగుంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత గుడుంబ శంకర్‌లో పవన్‌ సరసన నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. ఈ పాటికే ఈ హీరోయిన్‌ ఎవరో మీకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదూ! అవును ఈ హీరోయిన్‌ మరెవరో కాదు అందాల తార మీరా జాస్మిన్‌. భద్ర, రారాజు, మహానంది, గొరింటాకు వంటి చిత్రాల్లో అలరించిన మీరా జాస్మిన్‌ ఆ తర్వాత క్రమంగా తెలుగు సినిమాలకు దూరమైంది. అయితే తమిళం, మలయాళంలో మాత్రం కొన్ని సినిమాల్లో నటించింది.

అయితే ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తెలుగులో నటిస్తోంది. విమానం సినిమా ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇదిలా ఉంటే ఒకప్పుడు గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉన్న మీరా జాస్మిన్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం గ్లామర్‌ డోస్‌ను ఓ రేంజ్‌లో పెంచేసింది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో తన గ్లామర్‌ షోతో కుర్రకారు హృదయాలు కొల్లగొడుతోంది. చివరిగా స్వాగ్‌ మూవీలో నటించి మెప్పించింది. ఇక సినిమాల విషయం ఎలా ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది.

తన లేటెస్ట్‌ విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే మీరా జాస్మిన్ పోస్ట్ చేసే ఫొటోలు సోషల్‌ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. గ్లామర్ అవుట్‌ ఫిట్స్‌లో మీరా జాస్మిన్‌ చేస్తోన్న సందడి మాములుగా లేదు. ఇక మీరా జాస్మిన్‌ చేతిలో ప్రస్తుతం కేవలం ఒక సినిమా మాత్రమే ఉంది. మరి మీరా జాస్మిన్‌ అందుకున్న గ్లామర్‌ షో ఆమెకు అవకాశాలు తెచ్చి పెడతాయో లేదో చూడాలి. 


Tags:    

Similar News