రేవతి చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది..? అల్లు అర్జున్‌ను ప్రశ్నించిన పోలీసులు..
అల్లు అర్జున్ (Allu Arjun)ను చిక్కడపల్లి పోలీసులు మంగళవారం మూడు గంటల పాటు విచారించారు.
అల్లు అర్జున్ (Allu Arjun)ను చిక్కడపల్లి పోలీసులు మంగళవారం మూడు గంటల పాటు విచారించారు. డిసెంబర్ 4న సంధ్య థియేటర్ లో తొక్కిసలాటకు సంబంధించి న్యాయవాది సమక్షంలో ఆయనను ప్రశ్నించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు.భద్రతతో ఆయనను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చారు.
విచారణ పూర్తైన తర్వాత అల్లుఅర్జున్ ను పోలీసులు ఆయనను నివాసానికి తీసుకెళ్లారు. సంధ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాటకు సంబంధించి వీడియోను చూపి పోలీసులు ఆయనను ప్రశ్నించారు. థియేటర్ కు ఆయన వచ్చే ముందు ఉన్న పరిస్థితి ఆ తర్వాత జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోను పోలీసులు ఆయనకు చూపారు.
తొక్కిసలాటలో రేవతి(Revati)) అనే మహిళ చనిపోయిన సమాచారం ఇచ్చాక కూడా తనకు తెలియదని మీడియా సమావేశంలో ఎందుకు చెప్పారని పోలీసులు ఆయనను అడిగారని సమాచారం. రేవతి మరణించిన విషయం ఎప్పుడు తెలిసిందని పోలీసులు ఆయనను అడిగారని తెలుస్తోంది. రేవతి మరణించిన విషయం ఎలా తెలిసిందని కూడా పోలీసులు ఆయనను ప్రశ్నించారు.
సంథ్య థియేటర్ కు రావద్దని సమాచారం ఇచ్చినా కూడా థియేటర్ కు ఎందుకు రావాల్సి వచ్చిందనే దానిపై ఆరా తీశారు. థియేటర్ కు హీరో, హీరోయిన్ రావద్దని సూచించినా సమాచారం అందిందా లేదా అని కూడా పోలీసులు ఆయన నుంచి సమాధానం కోరారు. పోలీసుల ప్రశ్నల్లో కొన్నింటికి అల్లు అర్జున్ సమాధానం ఇవ్వలేదు. తాము అడిగిన ప్రశ్నలకు సంబంధించి పోలీసులకు ఇచ్చిన సమాధానాలకు సంబంధించి స్టేట్ మెంట్ పై అల్లు అర్జున్ సంతకం తీసుకున్న తర్వాత పోలీసులు ఆయనను స్టేషన్ నుంచి పంపారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు ఆయనను కోరారు.