Vijay - Rashmika: ముంబై ఎయిర్‌పోర్టులో కెమెరాకు చిక్కిన విజయ్ దేవరకొండ, రష్మిక
Vijay Devarakonda Rashmika: హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచారు.
Vijay Devarakonda Rashmika: హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచారు. సోమవారం రాత్రి వీరిద్దరూ ముంబాయి ఎయిర్‌పోర్టులో (Mumbai Airport) కనిపించారు. ముందుగా ఎయిర్ పోర్టుకు వచ్చిన రష్మిక ఫొటో గ్రాఫర్లకు ఫోజులిచ్చారు. అభిమానులతో కలిసి ఫొటోలు దిగి సందడి చేశారు. ఇది జరిగిన కొద్ది సేపటికే విజయ్ దేవరకొండ కూడా అక్కడ సందడి చేశారు. వీరిద్దరూ క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్‌షిప్ లో ఉన్నారంటూ కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని వారు స్పష్టం చేశారు. అయినా వారిపై గాసిప్స్ మాత్రం ఆగట్లేదు. ఇటీవల ఈ జంట రెస్టారెంట్ లో కనిపించిన ఫొటో ఒకటి వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా వారిద్దరూ ఎయిర్‌పోర్టులో కనిపించడంలో వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారనే ప్రచారం మరోసారి తెరమీదికి వచ్చింది.
తన వ్యక్తిగత జీవితం గురించి సమయం వచ్చినప్పడు చెబుతానని విజయ్ దేవరకొండ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. అపరిమితమైన ప్రేమ అనేది ఉందో, లేదో తనకు తెలియదని, ఒకవేళ ఉంటే దాంతోపాటే బాధ కూడా ఉంటుందన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరికీ తోడు కావాలని.. తన దృష్టిలో ప్రేమలో ఉండటమంటే భాగస్వామిని కలిగి ఉండటమేనని రష్మిక తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనం లేదన్నారు.